మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్‌లో గొడ‌వ‌లు గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొద్ది రోజుల క్రితం మా అసోషియేషన్‌ అధ్యక్షుడు నరేష్‌, ఉపాద్యక్షుడు, కార్యదర్శి రాజశేఖర్‌, జీవితల మధ్య వివాదం చెలరేగింది.

ఆ తరువాత 'మా' డైరీ రీ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం ర‌చ్చ‌రచ్చ‌గా మారింది. తాజాగా మరోసారి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. 'మా' అధ్యక్షుడు నరేష్ పై ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

'మా' లో మళ్లీ ముసలం.. రెండ్రోజులుగా తెరుచుకొని తలుపులు!

నిధులు దుర్వినియోగం చేస్తున్నారని నరేష్ పై సభ్యులు ఆరోపణలు చేస్తున్నారు. 'మా' అభివృద్ధికి నరేష్ అడ్డంకిగా మారానని ఈసీ మెంబర్లు అంటున్నారు. నిధుల దుర్వినియోగంతో పాటు ఈసీ సభ్యులను అవమానపరుస్తున్నారంటూ ఆరోపిస్తున్నారు.

మాజీ అధ్యక్షుడు శివాజీరాజాపై నరేష్ కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నరేష్ లోపాలను తప్పుబడుతూ క్రమశిక్షణ సంఘానికి లేక రాశారు కమిటీ సభ్యులు. నిబంధనలు ఉల్లంఘించిన నరేష్ పై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

నరేష్ తన నిర్ణయాలతో 'మా'ను పూర్తిగా భ్రష్టుపట్టిస్తున్నారని జీవితా రాజశేఖర్ అన్నారు. 'మా' సభ్యులు ఆస్పత్రిలో ఉంటే నరేష్ కనీసం పరామర్శించడానికి కూడా వెళ్లరంటూ అసహనం వ్యక్తం చేశారు.