ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల ట్రెండ్ నడుస్తోంది. కథ ఆసక్తికరంగా అనిపిస్తే సినిమా తీయడానికి ముందుకొస్తున్నారు. అలానే నటి ప్రియాంకా చోప్రా ఓ బయోపిక్ ని 
ప్రకటించి ఇప్పుడు చిక్కుల్లో పడింది.  

వివాదాస్పద భారతీయగురు ఓషో శిష్యురాలు 'మా ఆనంద్ షీలా' కథతో సినిమాని తెరకెక్కించబోతున్నట్టు ఇటీవల ఓ టాక్ షోలో వెల్లడించింది ప్రియాంకా. ఈ సినిమాలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా వ్యవహరించాలని నిర్ణయించుకుంది. హాలీవుడ్ లో 'రెయిన్ మేన్' వంటి పాపులర్ సినిమా తీసిన బ్యారీ లెవిన్సన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించనున్నాడట.

కియారా క్లీవేజ్ షో... చూపరులకు పండగే

ఈ బయోపిక్ ని భారీ రేంజ్ లో నిర్మించాలని భావించిన ప్రియాంకకి పెద్ద షాక్ తగిలింది. తన బయోపిక్‌లో నటించడానికి పర్మిషన్ ఇవ్వనంటూ ఏకంగా ఓషో శిష్యురాలు మా ఆనంద్ షీలా ప్రియాంకకి లీగల్ నోటీసులు పంపించిందట. ఇప్పటికే మా ఆనంద్ షీలా కథతో నెట్‌ఫ్లిక్స్‌  ఓ సిరీస్‌ రూపొందించింది.

'వైల్డ్ వైల్డ్ కంట్రీ' పేరుతో వచ్చిన ఈ సిరీస్ కి ప్రేక్షకాదరణ లభించింది. ఇప్పుడు మళ్లీ అదే కథని ప్రియాంక చేయడానికి సిద్ధమవుతోంది. అయితే.. ప్రియాంకా మాత్రం ఈ సిరీస్ లో నటిస్తే తను అంగీకరించనని చెబుతోంది మా ఆనంద్ షీలా. దీనికి కారణమేంటంటే.. సినిమాలో తన పాత్రని ప్రియాంక కాకుండా అలియా భట్ పోషిస్తే తనకు ఓకే అని చెబుతోందట.

ఎందుకంటే 69 ఏళ్ల మా ఆనంద్ షీలా యుక్త వయసులో అచ్చం అలియా భట్ లాగే ఉండేదట. అందుకే.. అలియా భట్ చేస్తేనే తన బయోపిక్‌ తీయాలంటూ ప్రియాంకకి నోటీసులు పంపించింది. మరి ఈ విషయంలో ప్రియాంకా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!