బెంగళూరు: కన్నడ చిత్రసీమలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంంది. 29 ఏళ్ల సినీ నటి చందన ఆత్మహత్య చేసుకుంది. బెంగళూరులోని తన నివాసంలో విషం తీసుకుని ఆమె మరణించింది. ఈ సంఘటన మే 28వ తేదీన జరిగినప్పటికీ జూన్ 1వ తేదీన వెలుగులోకి వచ్చింది. 

చందన తన ఫోన్ లో వీడియో రికార్డు చేసింది. డెత్ నోట్ కూడా రాసింది. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. ప్రియుడు మోసం చేశాడని వీడియో రికార్డు చేసినట్లు తెలుస్తోంది. 

కర్ణాటకలోని హసన్ జిల్లా బెలూరుకు చెందిన చందన దినేష్ అనే వ్యక్తితో సంబంధాలు కొనసాగిస్తోంది. గత కొన్నేళ్లుగా వారిద్దరి మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోంది. అయితే, అతను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించడంతో చందన ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. 

దినేష్ కు అమ్మాయిలను మోసం చేసే అలవాటు ఉందని, దాంతో అతనితో పెళ్లిని చందన కుటుంబ సభ్యులు అంగీకరించలేదని కుటుంబ సభ్యులంటున్నారు.