టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టిన విషయం తెలిసిందే. 10ఏళ్లకు పైగా క్రికెట్ లో కొనసాగిన బజ్జి తన స్పిన్ బౌలింగ్ తో టీమిండియాకు అద్భుత విజయాల్ని అందించాడు. ఇక ఇప్పుడు సినిమాలతో ఆడియెన్స్ కి మరీంత కిక్కివ్వాలని రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి.

ఆ సినిమాకు 'ఫ్రెండ్ షిప్' అనే టైటిల్ ని కూడా సెట్ చేశాడు. అయితే సినిమాలో బిగ్ బాస్ బ్యూటీ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. తమిళ్ బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొని ఊహించని కాంట్రవర్సీలతో పాపులర్ అయిన లోస్లియా మరియనేసన్ హీరోయిన్ గా కనిపించనుందట. చాలా మంది సీనియర్ హీరోయిన్స్ ని పరీక్షించిన చిత్ర యూనిట్ ఫైనల్ గా హర్భజన్ కి జోడిగా కొత్త హీరోయిన్ అయితేనే బెటర్ అని లోస్లియా ని ఫిక్స్ చేసుకున్నారు.

ఎప్పటి నుంచో మంచి బ్రేక్ కోసం చేస్తున్న లోస్లియా ఫైనల్ గా ఇంటర్నేషనల్ క్రికెటర్ తో అవకాశం అందుకుంది. మరీ ఈ సినిమాతో అమ్మడు ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య సంయుక్తంగా  ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాని సీన్‌టొ స్టూడియోస్‌, సినీ మాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జెపిఆర్‌, స్టాలిన్ నిర్మిస్తున్నారు.