అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా ఎదుగుతోంది. ఇప్పటికే జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో పాపులర్ అయింది. తాం గ్లామరస్ ఫోటోస్ ని అభిమానులతో పంచుకుంటోంది. జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తె కావడంతో ఆమె టాలీవుడ్ లో కూడా నటించాలని ఎందరో అభిమానులు కోరుకుంటున్నారు. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Found my old phone, found some fun memz

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Jun 4, 2020 at 5:08am PDT

ఇటీవల బోనీ కపూర్ నివాసంలో ఊహించని సంఘటన జరిగింది. బోనీ కపూర్ నివాసంలోని ఓ సిబ్బంది కరోనాకు గురికావడం బాలీవుడ్ మొత్తాన్ని షాక్ కి గురి చేసింది. దీనితో బోనీ కపూర్ ఫ్యామిలీ మొత్తం ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నారు. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Happy Anniversary ❤️

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) on Jun 2, 2020 at 5:48am PDT

రానున్న 14 రోజుల పాటు తాము సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండబోతున్నట్లు బోనికపూర్ ఫ్యామిలీ ప్రకటించిన సంగతి తెలిసిందే. క్వారంటైన్ లో ఉంటున్న జాన్వీ కపూర్ తన పాత మెమొరీస్ ని గుర్తు చేసుకుంటోంది. తాను గడిపిన మధుర క్షణాలతో పాటు, తన తల్లిదండ్రుల ఫోటోలని కూడా జాన్వీ కపూర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తోంది. జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చినప్పుడు, ఇతర వెకేషన్స్ లో ఉన్నప్పటి దృశ్యాలని షేర్ చేసింది. అలాగే బోనికపూర్,శ్రీదేవి కలసి ఉన్న దృశ్యాల్ని కూడా షేర్ చేసింది.