ప్రపంచ మానవాళికి కరోనా వైరస్ పెను శాపంగా మారుతోంది. ఇప్పటికే వేలాదిమంది ప్రజల ప్రాణాలు బలిగొన్న కరోనా వైరస్ అనేక దేశాల్లో విజృంభిస్తోంది. ఇండియాలో ఇప్పటికే 700లకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వైరస్ నివారణకు చర్యలు చేపడుతున్న సంగతి తెలిసిందే. 

ఇందులో భాగంగా దేశం మొత్తం ఏప్రిల్ 15 వరకు లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ఇదివరకే ప్రకటించారు. దీనితో అన్ని రంగాలు దాదాపుగా షట్ డౌన్ అయ్యాయి. చిత్ర పరిశ్రమలో అనేక చిత్రాల షూటింగ్స్ నిలిచిపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే చిత్రంలో నటిస్తున్నాడు. 

లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ కూడా వాయిదా పడింది. దీనితో మెగాస్టార్ ఇంట్లో ఖాళీగానే ఉంటున్నారు. లాక్ డౌన్ ఎఫెక్ట్  బహుశా ఇంట్లో పనివారు కూడా లేరేమో.. అందుకే చిరంజీవి స్వయంగా తన ఇంట్లో పూల మొక్కలకు నీళ్లు పడుతున్నారు. ఈ ఫోటో ప్రస్తుతం సామజిక మాధ్యమాల్లో వైరల్  మారింది.