బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, బెంగాలీ, మరాఠీ, హిందీ భాషల్లో ప్రసారమవుతోన్న ఈ షో బుల్లితెరపై బిగ్గెస్ట్ హిట్. తెలుగులో ప్రస్తుతం మూడో సీజన్ నడుస్తుండగా.. హిందీలో సల్మాన్ హోస్ట్ గా 13వ సీజన్ సాగుతోంది. మిగిలిన భాషలతో పోలిస్తే హిందీ బిగ్ బాస్ కి 
ఉన్న క్రేజ్ వేరు.

రియాలిటీ షోలో వాళ్లు ఆడే టాస్క్ లు ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల మొదలైన బిగ్ బాస్ 13వ సీజన్ రంజుగా సాగుతోంది. ఇక బిగ్ బాస్ అంటేనే వివాదాలకు కేరాఫ్ అడ్రెస్ గా మారింది. తాజాగా మరో వివాదాస్పద టాస్క్ ని కంటెస్టంట్స్ తో ఆడిస్తున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. హిందీ బిగ్ బాస్ లో కూడా ఇంటి సభ్యులు వారం మొత్తానికి కావాల్సిన సామాన్ల కోసం 'లగ్జరీ బడ్జెట్' టాస్క్ ఆడాల్సి ఉంటుంది.

ఈ వారం బిగ్ బాస్ హౌస్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ కోసం బిగ్ బాస్ ఓ ఇంటరెస్టింగ్ టాస్క్ ఇచ్చాడు. అదేంటంటే.. వారానికి సంబంధించిన సామాన్లను చేతితో ముట్టుకోకుండా కేవలం నోటితో మాత్రమే అందుకోవాలి. అలా ఒకరి నోట్లో నుండి ఒకరు అందుకొని చివరి కంటెస్టంట్స్ వరకూ ఆ వస్తువు వస్తే అది వాళ్ల సొంతమవుతుంది. ఈ టాస్క్ లో భాగంగా ఒకరి నోట్లో నుండి ఒకరు సామాన్లు అందుకుంటూ మధ్య మధ్యలో పెదాల రుచి కూడా చూసేస్తున్నారు.

పెద్ద పెద్ద వస్తువులను బాగానే అందుకున్నారు కానీ.. చిన్న వస్తువులను అందుకునే సమయంలో ఒకరి పెదాలు మరొకరి పెదాలకు దగ్గరగా వెళ్లడం వంటివి జరిగాయి. ముఖ్యంగా సిద్ధార్థ్ డే, షెహనాజ్ గిల్ ల మధ్య ఆల్మోస్ట్ లిప్ లాక్ జరిగిందనే చెప్పాలి. సిద్ధార్థ్ నోటితో గుడ్డుని తీసుకుంటూ షెహనాజ్ ని ముద్దాడబోయాడు. ప్రస్తుతం ఈ లగ్జరీ కిస్ టాస్క్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.