Asianet News TeluguAsianet News Telugu

#Liger: US లో 'లైగర్‌' పరిస్దితి అంత ఘోరమా? గోలెత్తిపోతున్నారు

 ఈ చిత్రం ఆగస్ట్ 24, బుధవారం అమెరికన్ థియేటర్‌లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ప్రీమియర్స్ ద్వారానే $200K కంటే ఎక్కువ వసూలు చేసి ఈ చిత్రం చరిత్ర సృష్టించింది.అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది.

Liger US Box Office Collections disappointed big time
Author
First Published Aug 30, 2022, 9:11 AM IST


ఈ ఏడాది దేశ వ్యాప్తంగా సినిమా అభిమానులు ఎదురుచూసిన  పాన్‌ ఇండియా మూవీ లైగర్‌. ఈ చిత్రం ఫిల్మ్‌ ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా నిలిచిపోయింది. విజయ్‌ దేవరకొండ, పూరి జగన్నాథ్‌లాంటి క్రేజీ కాంబినేషన్‌.. భారీ బడ్జెట్‌.. అదిరిపోయిన ప్రమోషన్లు.. వీటన్నింటినీ చూస్తే లైగర్‌ రికార్డులు బద్ధలు కొడుతుందా అనిపించింది. కానీ మార్నింగ్ షోకే అందరి అంచనాలు తల క్రిందులయ్యాయి. పాన్‌ ఇండియా మూవీగా వచ్చిన లైగర్‌ తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజైంది. హిందీలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా అంటే గురువారం(ఆగస్ట్‌ 25) రాత్రి స్పెషల్‌ షోలు వెయ్యగా శుక్రవారం మూవీ రిలీజ్‌ అయ్యింది.

ఈ  స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం లైగర్ విడుదలకు ఒకరోజు ముందే అమెరికాను షేక్ చేసింది. అమెరికా బాక్సాఫీస్ వద్ద గర్జిస్తూ రికార్డు కలెక్షన్లకు ముందే తెరతీసింది. అనన్య పాండే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ 24, బుధవారం అమెరికన్ థియేటర్‌లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ప్రీమియర్స్ ద్వారానే $200K కంటే ఎక్కువ వసూలు చేసి ఈ చిత్రం చరిత్ర సృష్టించింది. అయితే ఆ వేగం కనపడలేదు. సరిగమ వారు లైగర్ ని ఓవర్ సీస్ లో డిస్ట్రిబ్యూట్ చేసారు. వారు పూర్తి స్దాయిలో నష్టపోయారని సమాచారం.

లైగర్ ఓవర్ సీస్ లో బ్రేక్ ఈవెన్ రావాలంటే 1.8 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయాలి.  హాఫ్ మిలియన్ తో ప్రీమియర్ కు తెచ్చుకుంది.  ఆతర్వాత పూర్తి గా కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి. మొదటి వీకెండ్ లో  $750K మాత్రమే కలెక్ట్ చేసి నిరాశపరిచింది.

ఇక  లైగర్‌తోనే బాలీవుడ్‌లో అడుగు పెట్టాడు విజయ్ దేవరకొండ. అయితే ఇది ఆ రేంజ్‌ మూవీ కాదని కూడా కొందరు అభిప్రాయపడ్డారు. మూవీ ఫస్ట్‌ రివ్యూలు ఎలా ఉన్నా.. దీనిపై భారీ అంచనాలు ఉండటంతో అడ్వాన్స్‌ బుకింగ్స్‌ పెద్ద ఎత్తున జరిగాయి. దీంతో ఓపెనింగ్స్‌ విషయంలో మాత్రం లైగర్‌కు ఢోకా లేదు. కానీ తర్వాతే దెబ్బ పడింది.  విజయ్‌ ఫ్యాన్స్‌కు ఈ మూవీ బాగానే నచ్చింది. అయితే మిగతా వారు మాత్రం పెదవి విరిచారు. విజయ్‌ పర్ఫార్మెన్స్‌కు అందరూ వందకు వంద మార్కులు వేసినా.. స్టోరీ, స్క్రీన్‌ప్లే నాసిరకంగా ఉన్నట్లు సోషల్ మీడియాలో నెటిజన్లు అభిప్రాయపడ్డారు. 

పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారు. రమ్యకృష్ణతోపాటు మాజీ అమెరికన్ ప్రొఫెషనల్ బాక్సర్ మైక్ టైసన్ భారతీయ సినిమాలో అరంగేట్రం చేస్తున్నాడు. రోనిత్ రాయ్ , మకరంద్ దేశ్ పాండేలు కూడా ఈ చిత్రంలో కనిపించారు. లైగర్‌ను ధర్మ ప్రొడక్షన్స్‌పై కరణ్ జోహార్, పూరి కనెక్ట్స్ కింద పూరి జగన్నాథ్ , ఛార్మి కౌర్ కలిసి నిర్మించారు.

Follow Us:
Download App:
  • android
  • ios