#LEO ఫ్లాష్ బ్యాక్ నిజం కాదా? షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సినిమాటోగ్రాఫర్

ఏది నిజమో..ఏది అబద్దమో అంటూ అభిమానులు ఆలోచనలో పడిపోయారు. దాంతో  ఈసినిమా మరో సారి చూడాలన్న ఆలోచన కలుగుతోందంటున్నారు. చూడని వారు ఈ వింతేంటో చూడటానికి వెళ్తారంటున్నారు.   
 

Leo  Cinematographer words about the flashback portions jsp

లియో సినిమా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదలై  మిక్సెడ్ టాక్ తెచ్చుకుంది. అయితే కలెక్షన్స్ పరంగా  బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్తోంది. ఈ సినిమా అంతా బాగానే ఉన్నా సెకండాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మాత్రం బాగోలేదంటూ విమర్శలు వచ్చాయి. ఫ్లాష్ బ్యాక్ లో సంజయ్ దత్ పాత్ర నరబలి, జాతకాలు అంటూ ముందుకు వెళ్లటం చాలా మందికి డైజస్ట్ కాలేదు. ఆ విషయమై అభిమానుల్లో బారీగా చర్చ జరుగుతోంది. ఈ విషయమై టీమ్ దాకా చేరింది. 

  ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా పనిచేసిన మనోజ్ పరమహంస సినిమాలోని ఫ్లాష్ బ్యాక్ సన్నివేశం గురించి ఒక షాకింగ్ కామెంట్ చేసారు. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రీసెంట్ గా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ..... లియో ఫ్లాష్ బ్యాక్ అబద్ధం కూడా కావచ్చు... ఒక తెలియని వ్యక్తి (మన్సూర్) లియో పాత్ర గురించి చెప్పిన ఫ్లాష్ బ్యాక్ లో నిజం లేకపోవచ్చు అని మనోజ్ అన్నారు. 

Leo  Cinematographer words about the flashback portions jsp

కథలో భాగంగా అసలు లియో ఎవరు అనే విషయం కనుక్కోవటానికి ...జైల్లో ఖైదీగా ఉన్న మన్సూర్ అలీ ఖాన్ దగ్గరకు పోలీస్ అధికారి గౌతమ్ మీనన్ వెళ్తారు. అతను  ఒక కట్టుకథను గౌతమ్ మీనన్‌కు చెప్పి ఉండొచ్చనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడాడు. అంటే మనం సినిమాలో చూసిందంతా అబద్ధం.. చెప్పారన్నమాట. ఈ సినిమాకు సీక్వెల్ గా విజయ్‌తో తర్వాత తీసే సినిమాలో అసలు నిజం చూపిస్తారని ‘లియో’ టీం వర్గాలు అంటున్నాయి. ఏది నిజమో..ఏది అబద్దమో అంటూ అభిమానులు ఆలోచనలో పడిపోయారు. దాంతో  ఈసినిమా మరో సారి చూడాలన్న ఆలోచన కలుగుతోందంటున్నారు. చూడని వారు ఈ వింతేంటో చూడటానికి వెళ్తారంటున్నారు.   

ఇక సినిమాలో  యాక్షన్ ఎపిసోడ్స్ అదిరిపోయేలా అనిపించేలాగే ఉన్నా… లోకేష్ గత చిత్రాల్లో కనిపించిన ఎమోషనల్‌ కనెక్టవిటీ  ఈ సినిమాలో లేదన్న విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరో ప్రక్క ఈ సినిమాలో రామ్ చరణ్ గెస్ట్ రోల్‌ లో కనిపించబోతున్నారంటూ  వార్తలు వైరల్ అయ్యీయి. చిత్రయూనిట్ కూడా ఈ వార్తలను ఖండించలేదు. వచ్చే క్రేజ్ ని పోగొట్టుకోవటం ఎందుకనుకున్నారు. కానీ సినిమాలో చరణ్‌ కనిపించకపోవటంతో అభిమానులను  హర్ట్ చేసింది.   

ఇక  విజ‌య్ ఇందులో పార్తిబ‌న్‌, లియోగా రెండు కోణాలున్న పాత్ర‌ల్లో క‌నిపించారు. ఈ రెండింటికీ మ‌ధ్య ఉన్న తేడాని చ‌క్క‌గా చూపించారు. ఇద్ద‌రు పిల్ల‌ల తండ్రిగా పార్తి పాత్ర‌లో విజ‌య్ క‌నిపించిన తీరు.. ఆయ‌న లుక్‌, గెట‌ప్ ఆక‌ట్టుకుంటాయి. ఇక లియోగా నెగిటివ్ షేడ్స్ ఉన్న  పాత్ర‌లో చ‌క్క‌టి హీరోయిజాన్ని చూపించారు. ప్రస్తుతానికి దసరా సెలవులను పర్ఫెక్ట్‌ గా క్యాష్ చేసుకుంటున్న లియో… ఆ తరువాత ఈ  జోరు ని ఏ మేరకు కొనసాగిస్తుందో చూడాలి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios