దసరా రిలీజ్ లు...దేనికి ఎక్కువ స్క్రీన్స్ కేటాయింపు,షాకింగ్ మేటర్
ఒకవైపు బాలకృష్ణ, మరోవైపు రవితేజ, ఇంకొక వైపు దళపతి విజయ్ ఎవరికి వాళ్ళు తమ సినిమాలతో దసరాకు దండయాత్రకు బయలుదేరుతున్నారు
ఈ వారం థియేటర్లలో బాలకృష్ణ “భగవంత్ కేసరి”, రవితేజ “టైగర్ నాగేశ్వరరావు” తో పాటు విజయ్ “లియో” సినిమాలు వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. దసరా కానుకగా వస్తున్న ఈ సినిమాలపై అభిమానులు, ప్రేక్షుల్లో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ఇప్పటి వరకూ ఈ మూడు హై బజ్ ఉన్న మూవీస్ నుంచి వచ్చిన సాంగ్స్, టీజర్ & ట్రైలర్ లుప్రేక్షకులని విశేశంగా ఆకట్టుకున్నాయి. అయితే ఈ సినిమాలకు మొదటి నుంచి థియేటర్స్ సమస్య వస్తుందా అనే సమస్య అభిమానులను వెంటాడుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపధ్యంలో ఏ సినిమాకు ఎన్ని స్క్రీన్స్ కేటాయించారనే విషయం బయిటకు వచ్చింది. అందుతున్న సమాచారం మేరకు..
Ap/Ts లలో మొదటి రోజు టోటల్ కౌంట్ స్క్రీన్స్ (షిప్ట్ షోలతో కలిపి)
#Leo - 880 స్క్రీన్స్
#BhagavathKesari - 1100 స్క్రీన్స్
#TigerNageswaraRao - 480 స్క్రీన్స్
‘ఖైదీ’, విక్రమ్’ ల వంటి భారీ హిట్స్ తీసిన దర్శకుడు లోకేష్ కనక రాజ్ తో, రూ. 205-300 కోట్ల అతిభారీ బడ్జెట్ తో ‘లియో’ మెగా యాక్షన్ థ్రిల్లర్ నిర్మింపజేసుకుని దళపతి విజయ్ దసరా రావటం భాక్సాఫీస్ దగ్గర కలవరం లాంటిదే పుట్టిస్తోంది. తెలుగు సినిమాలు వదిలేసి ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా విపరీతంగా వుంది. అమెరికా, బ్రిటన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ లో ‘లియో’ తెలుగు వెర్షన్ ట్రెండింగ్ అవుతోంది.‘లియో’ తెలుగు వెర్షన్ ఓవర్సీస్ మార్కెట్లలో పెద్ద ప్రభావాన్నే చూపిస్తోంది. ‘భగవంత్ కేసరి’, ‘టైగర్ నాగేశ్వరరావు’ విజయావకాశాల్ని ప్రభావితం చేసేంతగా అడ్వాన్సు బుకింగ్స్ ని సొంతం చేసుకుంటోంది. దీని ట్రైలర్ చూసి తమిళ ప్రేక్షకులే పెదవి విరిచేసినా తెలుగు ప్రేక్షకులు ఉత్సాహంగా వున్నారు. బ్రిటన్ లో ‘లియో’ తెలుగు వెర్షన్ టిక్కెట్ విక్రయాలు శరవేగంగా పెరుగుతూ ‘భగవంత్ కేసరి’ ని క్రాస్ చేసే స్థితికి చేరుకున్నాయి. ‘టైగర్ నాగేశ్వరరావు’ ని మూడవ స్థానానికి నెట్టేసింది.
ఈ మూడు సినిమాలు చూడటం కోసం వీలైనంత త్వరగా తమ టిక్కెట్‌లను పొందే అవకాశం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాల బుకింగ్‌లు ఏపీ, తెలంగగాణ రాష్ట్రాలతో పాటు ఇతర ప్రముఖ ప్రాంతాలలో ఓపెన్ అయ్యాయి. ఇక బాలకృష్ణ “భగవంత్ కేసరి” తెలుగు వెర్షన్‌లో రిలీజ్ అవుతుండగా, “లియో” , “టైగర్ నాగేశ్వరరావు” పాన్-ఇండియన్ విడుదలకు సిద్ధమయ్యాయి.