బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఫ్యామిలిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అమితాబ్ వియ్యపురాలు రీతూ నంద కన్ను మూశారు. గత కొంత కాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె నేడు ఢిల్లీలోని ఓ ప్రయివేట్ హాస్పిటల్ లో చిక్కిత్స పొందుతూ మృతి చెందారు.

అమితాబ్ కూతురు శ్వేతా బచ్చన్ అత్తగారైన రీతూ నంద మరణించడం బాలీవుడ్ ప్రముఖులను షాక్ కి గురి చేసింది. 71ఏళ్ల రీతూ నందకు బాలీవుడ్ సినీ ప్రముఖులతో మంచి సాన్నిహిత్యం ఉంది.  ఆమె సినిమాలకు దూరంగానే ఉన్నప్పటికీ తండ్రి రాజ్ కపూర్ కారణంగా ఆమెకు సీనియర్ నటీనటులు మంచి స్నేహితులయ్యారు. ఇక ఆమె మరణవార్త గురించి తెలుసుకున్న అమితాబ్ బచ్చన్ వెంటనే ఢిల్లీ హాస్పిటల్ కి చేరుకున్నారు.

ప్రస్తుతం ఆమెను కడసారి చూసేందుకు ముంబైలోని ఆమె స్వగృహానికి సినీ తారలు తరలివస్తున్నారు. షూటింగ్ లో బిజీగా ఉన్న చాలా మంచి కపూర్ ఫ్యామిలీ మెంబర్స్ పనులను క్యాన్సిల్ చేసుకొని ఢిల్లీ హాస్పిటల్ కి వస్తున్నారు. కొంతమంది కుటుంబ సభ్యులు విదేశాల్లో ఉండడంతో రీతూ నంద అంత్యక్రియలు రేపు జరిగే అవకాశం ఉంది.