బాలీవుడ్‌ లెజెండరీ యాక్టర్‌ రిషీ కపూర్‌ ఈ రోజు (గురువారం) ఉదయం 8 గంటల 45 నిమిషాలకు తుది శ్వాస విడిచారు. ఇర్పాన్‌ ఖాన్ మరణించిన 24 గంటలు కూడా గడవక ముందే మరో లెజెండ్‌ను కోల్పోవటంతో బాలీవుడ్ సినీ ఇండస్ట్రీ శోక సంద్రంలో మునిగిపోయింది. ఈ నేపథ్యంలో రిషీ కపూర్‌ జీవితంలోనూ సంఘటనలు ఆయన పోషించిన పాత్రలు ఆయనతో తమకున్న సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు సెల్రబిటీలు. ఆయనకు కడసారిగా చూసి నివాళులు అర్పించే అవకాశం కూడా లేకపోవటంతో సోషల్ మీడియా ద్వారా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ నేపథ్యంలో రిషీ కపూర్‌ చేసిన చివరి ట్వీట్‌ వైరల్‌ గా మారింది. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే రిషీ కపూర్‌ ఏప్రిల్ 2న తన చివరి ట్వీట్ చేశారు. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న క్లిస్ట్ పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలకు కొన్ని సూచనలు చేశారు. కరోనా పై పోరాటంలో ముందుకు వరుసలో నిలుచొని పోరాడుతున్న పోలీసులు, వైద్యులు, నర్సుల పట్ల గౌరవం చూపించాలని ప్రజలకు అభిమానులకు విజ్ఞప్తి చేశారు. మనకోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడుతున్న వారిపై దాడులుమానుకోవాలని కోరాడు. ఈ ట్వీట్ చేసిన తరువాత సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న ఆయన ఆరోగ్యం విషమించటంతో ఏప్రిల్ 30న తుది శ్వాస విడిచారు.