పూరి జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ‘ఫైటర్’ . ఈ సినిమాలో హీరోయిన్ గా అనన్య పాండే కనిపించనుంది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో హీరోయిన్‌గా పరిచయమైన బాలీవుడ్ నటుడు చుంకీ పాండే కుమార్తె అనన్య పాండే.  రీసెంట్‌గా ఈ భామ సినిమా షూటింగ్‌లో పాల్గొంది.  ఈ నేపధ్యంలో ఈ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీకయ్యాయి. విజయ్ దేవరకొండ బైక్‌పై కూర్చుని ఉండగా, అనన్య అతనికి ముందు కూర్చుంది. రాత్రివేళల్లో ఈ సీన్‌ను షూట్ చేస్తూండగా ఎవరో ఫొటోలు తీసారు. దాంతో ఈ ఫొటోలు కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

చాలాకాలంగా హిట్ లేక వెనక బడ్డ పూరి జగన్నాథ్ ఒక్కసారిగా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ఒడ్డునపడ్డారు. తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు . ఈ సినిమా సక్సెస్ తరువాత అర్జున్ రెడ్డి స్టార్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్నారు. కరణ్ జోహార్ సమర్పిస్తున్న ఈ సినిమాకు వస్తున్న క్రేజ్ ని చూసి బడ్జెట్ ని పెంచేసినట్లు సమాచారం. పూరి, విజయ్ దేవరకొండ కాంబో కాబట్టి ఖచ్చితంగా మంచి బిజినెస్ ఎక్సపెక్ట్ చేయవచ్చు. ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ ను కొత్తగా చూపించి మెప్పించిన పూరి, విజయ్ ను ఎలాంటి లుక్ లో చూపించబోతున్నారో చూడాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


 
ఇండస్ట్రీలో చెప్పుకునే స్టోరీ లైన్ ప్రకారం ..పదాలు సరిగా పలకలేని వ్యక్తి, జీవితంలో ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడు. తనకు ఎదురయ్యే సమస్యలపై ఫైటర్ గా నిలిచి ఎలా గెలుపు సాధిస్తాడు అనే పాత్రలో విజయ్ దేవరకొండ నటించనున్నాడని టాక్. ఫైటర్ షూటింగ్ ముంబైలో మొదలైంది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ థాయిలాండ్ లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్‌లో తీసుకున్నాడు.
 
అలాగే  “ఫైటర్” సినిమా తెలుగులోనే కాకుండా పలు ఇతర భాషల్లో కూడా విడుదల కాబోతోంది. పాన్ ఇండియా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ విడుదలవుతుంది.