Asianet News TeluguAsianet News Telugu

లక్ష్మీపార్వతి కీ రోల్ లో 'రాధాకృష్ణ'!

అనురాగ్, ముస్కాన్ శెట్టిలు జంటగా నటించిన ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కనుమరుగవుతున్న నిర్మల్‌ కొయ్య బొమ్మల కథా నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

Laxmi Parvathi Main Role In Radha Krishna Telugu Movie
Author
Hyderabad, First Published Feb 22, 2020, 2:44 PM IST

దివంగత ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న చిత్రం 'రాధాకృష్ణ' ప్రసాద్ వర్మ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తోన్న ఈ చిత్రాన్ని 'ఢమరుకం' శ్రీనివాసరెడ్డి సమర్పణలో పుష్పాల సాగరిక, శ్రీనివాస్ కానురులు సంయుక్తంగా నిర్మించారు.

అనురాగ్, ముస్కాన్ శెట్టిలు జంటగా నటించిన ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్నేష్ బాబు మరో కీలకపాత్ర పోషిస్తున్నాడు. కనుమరుగవుతున్న నిర్మల్‌ కొయ్య బొమ్మల కథా నేపథ్యంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.

అందరి హృదయాలను హత్తుకునే, అన్ని రకాల ఎమోషన్స్ తో కూడిన అందమైన ప్రేమ కథగా రూపొందిస్తున్నట్లు నిర్మాత తెలిపారు. త్వరలోనే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అలీ, కృష్ణ భగవాన్‌, చమ్మక్‌ చంద్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎమ్‌ఎమ్‌ శ్రీలేఖ సంగీత మందిస్తున్నారు.

Laxmi Parvathi Main Role In Radha Krishna Telugu Movie

Follow Us:
Download App:
  • android
  • ios