అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ కి పరిచయమైన బ్యూటీ లావణ్యా త్రిపాఠి. అమ్మడి లక్కేమిటో గాని సక్సెస్ ఇలా వచ్చి అలా మిస్ అవుతోంది. చాలా కాలం తరువాత అమ్మడికి మంచి విజయం దక్కింది. ఆలస్యంగా వచ్చిన అర్జున్ సురవరం పరవాలేధనిపించే విధంగా బాక్స్ ఆఫీస్ వద్ద కాస్త హడావుడి చేసింది. దీంతో బేబీకి అవకాశాలు కూడా వస్తున్నాయి.

 గీత ఆర్ట్స్ బ్యానర్ లో కార్తికేయ నటించనున్న 'చావు కబురు చల్లగా' సినిమాలో లావణ్య నటించనున్నట్లు తెలుస్తోంది. కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాను బన్నీ వాసు నిర్మిస్తున్నారు. మొత్తానికి లావణ్య మంచి అఫర్ దక్కించుకోవడంతో అమ్మడి కెరీర్ మళ్ళీ ట్రాక్ లోకి వచ్చింది. కెరీర్ మొదట్లో కాస్త హడావుడిగా కనిపించిన ఈ ముద్దుగుమ్మ బాక్స్ ఆఫీస్ హిట్స్ గట్టిగానే అందుకుంది.

 

సోగ్గాడే చిన్ని నాయన - భలే భలే మగాడివోయ్ వంటి సినిమాలు అమ్మడికి మంచి క్రేజ్ తెచ్చి పెట్టాయి. కానీ ఆ తరువాత చేసిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ అవ్వలేదు. మిష్టర్ - రాధా -యుద్ధం శరణం - ఉన్నది ఒక్కటే జిందగీ వంటి సినిమాలు అమ్మడిని తీవ్రంగా నీరాశపరిచాయి. దాదాపు అమ్మడి కెరీర్ క్లోజ్ అనుకునే టాక్ కూడా వైరల్ అయ్యింది. అలాంటి సమయంలో అర్జున్ సురవరం సినిమా బేబీకి మంచి సక్సెస్ ని అందించింది. దీంతో ఇప్పుడు గీతా ఆర్ట్స్ లాంటి బ్యానర్ లో అవకాశం అందుకుంది. మరి ఈ అవకాశాలతో అమ్మడు ఎలాంటి సక్సెస్ ని అందుకుంటుందో చూడాలి.