పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా ఏళ్ళ తరువాత సినిమా ఇండస్ట్రీలో స్పీడ్ పెంచాడు. ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరో వైపు చకచకా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అభిమానులు వకీల్ సాబ్ సినిమా కోసం ఎదురుచూస్తున్న చూస్తున్న సంగతి తెలిసిందే. వీలైనంత త్వరగా మరొక రెండు సినిమాలను స్టార్ట్ చేయాలని పవన్ ప్లాన్ చేసుకుంటున్నాడు.

అసలు మ్యాటర్ లోకి వస్తే.. పవర్ స్టార్ తో రొమాన్స్ చేయడానికి ఓకే హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందాల రాక్షసి సినిమాతో పరిచయమైన క్యూట్ బ్యూటీ లావణ్య త్రిపాఠి పవన్ స్టార్ సినిమాలో నటించే అవకాశం ఉందట. అయితే అది వకీల్ సాబ్ సినిమాలోనా లేక పవన్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పీరియాడిక్ సినిమాలోనా అనేది తెలియాల్సి ఉంది.

వాకీల్ సాబ్ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించే అవకాశం ఉన్నట్లు మొన్నటి వరకు ఒక టాక్ వచ్చింది. ఇక ఇప్పుడు లావణ్య త్రిపాఠిని తీసుకుంటున్నారు అనే మరొక రూమర్ కూడా వస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఇక రీసెంట్ గా పవన్  పూరి జగన్నాథ్ తో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పవర్ స్టార్ సిద్ధంగా ఉన్నారట.

గత కొన్నేళ్లుగా పూరి 'జనగణమన' అనే స్క్రిప్ట్ ని స్టార్ హీరోతో తెరకెక్కించాలని చూస్తున్నాడు. మహేష్ బాబు ఆ మధ్య చేస్తానని చెప్పి డ్రాప్ అయ్యాడు. ఇక అదే కథను పవన్ కళ్యాణ్ తో చేయాలనీ పూరి డిసైడ్ అయ్యాడట. ఆ కథలో పవన్ ని సీఎం గా కనిపించబోతాడట. ఎలాగైనా పవన్ తోనే ఆ సినిమా చేయాలనీ పూరి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయినట్లు సమాచారం.