ఇటీవల కాలంలో అందరి దృష్టిలో పడేందుకు సెలబ్రిటీ మీద కామెంట్‌లు చేయటం ఈజీగా వేగా భావిస్తున్నారు కొంత మంది ఆకతాయిలు. ప్రముఖ పర్సనల్, ఫ్రొఫెషనల్‌ కెరీర్స్‌ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తే ఈజీగా పాపులర్ అయిపోవచ్చు అని భావిస్తున్నారు. ఇలాంటి సంఘటనలు ఒక్కోసారి ఆ సెలబ్రిటీలకు తలనొప్పిగా మారుతున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. తాజాగా హీరోయిన్‌ లావణ్య త్రిపాఠికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది.

కొద్ది రోజుల క్రితం సునిశిత్‌ అనే వ్యక్తి ఓ యూట్యూబ్‌ చానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్య్వూలో తాను తనను పలువరు స్టార్‌ హీరోలు తొక్కేశారని, వన్‌ నేనొక్కడినే సినిమాకు ముందుగా తానే హీరోనని చెప్పాడు సునిశిత్‌. అదే సమయంలో ఆ వ్యక్తి లావణ్య త్రిపాఠి గురించి కూడా సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను లావణ్యతో డేటింగ్ చేసినట్టుగా చెప్పటంతో ఆ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. అయితే ప్రస్తుతం తాము కలిసి లేమని, ఈ మధ్యే బ్రేకప్ చెప్పేసుకున్నామని చెప్పాడు సునిశిత్‌.

అయితే అతడి వాలకం చూసిన ఎవరికైన అతడు పబ్లిసిటీ కోసమో, లేక మతి భ్రమించో ఇలా మాట్లాడుతున్నాడన్న విషయం అర్ధమవుతుంది. ఈ నేపధ్యంలో లాక్‌ డౌన్‌ కారణంగా ఇంటికే పరిమితమైన లావణ్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఈ ఇంటర్వ్యూలలో ఎట్టి పరిస్థితుల్లోనూ సునిశిత్‌ వ్యవహారం గురించి ప్రశ్నించ వద్దని ముందే కండిషన్‌ పెట్టిందట బ్యూటీ. ఇక తన సినిమా కెరీర్‌ గురించి మాట్లాడిన లావణ్య బోల్డ్ క్యారెక్టర్స్‌లో నటించడానికి కూడా రెడీ అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చేసింది.