దగ్గుబాటి వెంకటేష్ - అక్కినేని నాగ చైతన్య కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ వెంకిమామ రిలీజ్ డేట్ పై గత కొంత కాలంగా బిగ్ సస్పెన్స్ నడుస్తున్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాత సురేష్ బాబు ఎటు తేల్చుకోలేక రోజుకో చర్చతో వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. అసలైతే సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది కానీ రిలీజ్ టైమ్ బావుంటేనే కలెక్షన్స్ బావుంటాయని నిర్మాత డేర్ చేయలేకపోయారు.

పైగా సినిమా కోసం బడ్జెట్ పరిమితులు కూడా దాటేశారు. ఇన్నిరోజులు ఇంకా షూటింగ్ అయిపోలేదని చిత్ర యూనిట్ రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇవ్వకుండా వచ్చింది. దాదాపు డిసెంబర్ లోనే రిలీజ్ అవుతుంది అన్నట్లు కామెంట్స్ వచ్చాయి. కానీ ఆ తరువాత సంక్రాంతికి సిద్దమైనట్లు కథనాలు వెలువడ్డాయి. కానీ సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు - అల వైకుంఠపురములో వంటి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుండడంతో ఆ బాక్స్ ఆఫీస్ ఫైట్ నుంచి డ్రాప్ అయ్యారు.

వివాదంలో 'జార్జిరెడ్డి'.. రిలీజ్ అడ్డుకుంటామంటూ హెచ్చరికలు!

 అసలు మ్యాటర్ లోకి వస్తే.. నవంబర్ 23న నాగచైతన్య బర్త్ డే సందర్బంగా ఒక స్పెషల్ అప్డేట్ ఇవ్వబోతున్నారు. చైతు కెప్టెన్ కార్తీక్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఆ పాత్రకు సంబందించిన స్పెషల్ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నారు. చైతు లుక్ తో పాటు సినిమా రిలీజ్ డేట్ పై కూడా క్లారిటి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అల్లుడి ద్వారా అయినా రిలీజ్ డేట్ పై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి.

అందుతున్న సమాచారం ప్రకారం డిసెంబర్ 13వ తేదీని రిలీజ్ డేట్ గా ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.   సంక్రాంతికే రిలీజ్ చేయాలని అనుకున్నప్పటికీ థియేటర్స్ సమస్యతో పాటు సినిమా బడ్జెట్ కూడా కాస్త కంగారుపెడుతోంది. మొదట వెంకీ మామ సినిమాను 30కోట్ల లోపే పూర్తి చేయాలనీ అనుకున్న సురేష్ బాబు ఆ తరువాత 40కోట్ల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది.

దీంతో బాక్స్ ఆఫీస్ వద్ద మినిమమ్ కలెక్షన్స్ రాబట్టాలి.పాజిటివ్ టాక్ వచ్చినా ;కూడా ఈ రోజుల్లో పెట్టిన బడ్జెట్ వెనక్కి తీసుకురావడం అంత ఈజీ కాదు.  సో రిస్క్ లేకుండా డిసెంబర్ ఫస్ట్ లోనే సినిమాను రిలీజ్ చేయాలనీ సురేష్ బాబు కొత్త డేట్ సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. నాగ చైతన్య సరసన  రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుండగా వెంకటేష్ కి జోడిగా పాయల్ రాజ్ పుత్ నటించింది. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.