ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న టాలీవుడ్ మూవీ RRR. గతంలో ఎప్పుడు లేని విధంగా దర్శకుడు రాజమౌళి మొదటిసారి ఇద్దరి స్టార్ హీరోలను ఒకే తెరపై చూపించబోతున్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా ఈ సినిమాపై అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకున్నాయి. సినిమాకు సంబందించిన ఒక స్పెషల్ అప్డేట్ బయటకు వచ్చింది.

వర్కింగ్ టైటిల్ గా RRR తో షూటింగ్ ని కొనసాగిస్తున్న దర్శకుడు ఇటీవల హిందీ టైటిల్ పై డిస్కస్ చేసినట్లు తెలుస్తోంది.  మొదటి నుంచి రఘుపతి 'రాఘవ రాజారామ్' అనే టైటిల్ తో పోస్టర్స్ ని క్రియేట్ చేస్తున్న అభిమానులు దాదాపు అన్ని భాషల్లో అదే టైటిల్ ని ఫిక్స్ చేస్తున్నట్లు అనుకుంటున్నారు. అయితే రీసెంట్ గా దీనిపై చర్చ జరిపిన జక్కన్న హిందీలో 'రామ్ రావణ్ రాజ్' అనే టైటిల్ ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. నార్త్ ఆడియెన్స్ లో ఈ టైటిల్ తప్పకుండా క్లిక్ అవుతుందని అనుకుంటున్నారట.  సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

అయితే ప్రతిసారి కొత్త తరహాలో మ్యూజిక్ ఇచ్చే కీరవాణి ఈ సారి ఇంకాస్త కొత్త తరహా స్టైల్ ని ఫాలో కానున్నాడట. డిఫరెంట్ బీట్స్ ని సినిమా ఆడియోలో ప్రజెంట్ చేయనున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా సినిమాలో 7పాటలు కావాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేసుకున్నాడట. కుదిరితే ఆరు పాటలు సినిమాలో ప్రజెంట్ చేసి మరో పాటను ఆడియో ద్వారా అందించనున్నారు.  

రామ్ చరణ్ - జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ని సంతృప్తిపరిచే విధంగా ఇద్దరికి సమానమైన సాంగ్స్ ని కంపోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ - అలియా భట్ మధ్య కూడా ఒక ట్రెడిషినల్ మెలోడీ సాంగ్ ని కంపోజ్ చేశారని టాక్. ఇక ఇద్దరి హీరోల మధ్య ఉండే స్పెషల్ సాంగ్ సినిమాలోనే హైలెట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు పాటలకు ట్యూన్స్ రెడీ చేసిన కీరవాణి మరిన్ని పాటల కోసం రెగ్యులర్ గా దర్శకుడితో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.