Asianet News TeluguAsianet News Telugu

మెగాస్టార్ 152 లేటెస్ట్ అప్డేట్.. పక్కా ప్లాన్ తో సిద్దమైన కొరటాల గ్యాంగ్

నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెగాస్టార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లోనే అభిమానుల అభిరుచికి తగ్గట్టు సాంగ్ ని తెరకెక్కించిననున్నారట. మెగాస్టార్ ప్రస్తుతం ఉన్న హావభావాలతో తీయవల్సిన సాంగ్ అని ముందే దాన్ని ఫినిష్ చేయనున్నారట.

latest update on megastar koratala siva project
Author
Hyderabad, First Published Nov 5, 2019, 12:34 PM IST

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ఇటీవల సెట్స్ పైకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాపై జనాల్లో ఇప్పటికే అంచనాల డోస్ తారా స్థాయికి చేరుకుంది. అపజయం లేని దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ తో తప్పకుండ మరో ఇండస్ట్రీ హిట్ లాంటి సినిమా చేస్తాడని టాక్ వస్తోంది. ఎందుకంటె సినిమాలో ఉండే పాజిటివ్ పాయింట్ బలంగా ఉందట.

నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో మెగాస్టార్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ లోనే అభిమానుల అభిరుచికి తగ్గట్టు సాంగ్ ని తెరకెక్కించిననున్నారట. మెగాస్టార్ ప్రస్తుతం ఉన్న హావభావాలతో తీయవల్సిన సాంగ్ అని ముందే దాన్ని ఫినిష్ చేయనున్నారట. ఇక సెకండ్ షెడ్యూల్ నుంచి మెగాస్టార్ లుక్స్ లో కొన్ని మార్పులు చేయనున్నారట.

గత కొంత కాలంగా షెడ్యూల్స్ ని ప్లాన్ చేసుకుంటున్న చిత్ర యూనిట్ ఎట్టకేలకు ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇక మెగాస్టార్ సరికొత్త లుక్ తో దర్శనమివ్వనున్నట్లు అర్ధమవుతోంది. ఇకపోతే దర్శకుడు కొరటాల శివ నటీనటులను కూడా ఫైనల్ చేసినట్లు టాక్.

ఒక స్పెషల్ పాత్ర కోసం తెలుగు హీరోయిన్స్ ఈషా రెబ్బను సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ ఎపిసోడ్స్ లో కూడా ఈషా పాత్ర హైలెట్ అని సమాచారం.  మెగాస్టార్ సరసన అవకాశం దక్కించుకుంది అంటే అమ్మడు తప్పకుండా స్టార్ హీరోయిన్స్ కి పోటీ ఇచ్చే రేంజ్ కి వచ్చినట్లే.

అయితే ఆ పాత్ర ఎలా ఉండబోతోంది అన్నదే బిగ్ మిస్టరీ. సాధారణంగా కొరటాల సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలు కథకి దూరంగానే ఉంటాయి. పెద్దగా ఇంపార్టెన్స్ ఉండదు. మరి ఇప్పుడు ఈషా లాంటి బ్యూటీకి ఎలాంటి పాత్రని ఇస్తారో చూడాలి. ఇక సినిమాలో హీరోయిన్ గా త్రిషను అనుకుంటున్నట్లు టాక్ వస్తోంది. అయితే ఇంకా రూమర్స్ పై చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

Follow Us:
Download App:
  • android
  • ios