గత ఏడాది సంక్రాంతి విన్నర్ గా నిలిచిన F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. విడుదలైన ఆ సినిమా దాదాపు 80కోట్లవరకు లాభాలని అందించింది. అలాగే ఫెయిల్యూర్స్ తో  కాస్త తడబడిన వెంకటేష్ - వరుణ్ తేజ్ లకు కూడా సినిమా మంచి బూస్ట్ ఇచ్చింది. ఇకపోతే సినిమాకు సీక్వెల్ కూడా రెడీ అవుతున్నట్లు అప్పట్లో వార్తలు తెగ వైరల్ అయ్యాయి.

చిత్ర యూనిట్ కూడా ఆ విషయంపై క్లారిటీ ఇచ్చింది. అయితే మరోసారి F3 ప్రాజెక్ట్ పై అందరి ద్రుష్టి పడేలా ఫిల్మ్ నగర్ లో ఒక టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఒక స్టోరీ లైన్ ఫిక్స్ అయ్యిందని అయితే దాన్ని డెవలప్ చేయడానికి కాస్త సమయం పడుతుందని తెలుస్తోంది.  మరొక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. సినిమాలో మరో హీరోగా మాస్ రాజా రవితేజ కూడా కనిపించనున్నట్లు తెలుస్తోంది.

గతంలోనే ఈ టాక్ వచ్చినప్పటికీ ఇప్పుడు ఇంకా ఆ రూమర్ డోస్ పెరిగింది. హీరో వెంకటేష్ కూడా గతంలో ఒక స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. ఒక ఇంటర్వ్యూలో F2 సీక్వెల్ పై చర్చలు జరుగుతున్నట్లు చెబుతూ.. వరుణ్ తేజ్, డైరెక్టర్ అనిల్ రావిపూడి లతో అప్పుడపుడు కలుసుకొని సినిమాపై డిస్కస్ చేస్తున్నట్లు వెంకటేష్ తెలియజేశారు.

అసురన్ రీమేక్ సినిమా ఎండ్ అయిన తరువాత వెంకీ పూర్తిగా ఆ కామెడీ సీక్వెల్ పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. ఇక మరోవైపు వరుణ్ తేజ్ కూడా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఒక సినిమాలో నటిస్తున్నాడు. నిర్మాత దిల్ రాజు పలు సినిమాలతో బిజీగా ఉండగా అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫైనల్ గా F3 సినిమా సమ్మర్ లో సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.