Asianet News TeluguAsianet News Telugu

లతా మంగేష్కర్ చనిపోయారంటూ వార్తలు.. ఖండించిన కుటుంబం!

కొన్ని వెబ్ సైట్ల వారు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారు లతా మంగేష్కర్ చనిపోయినట్లు వార్తలు ప్రసారం చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో లతా మంగేష్కర్ కుటుంబసభ్యులు స్పందించక తప్పలేదు. 

Lata Mangeshkar's niece shoots down death rumours: Don't believe fake reports
Author
Hyderabad, First Published Nov 18, 2019, 5:51 PM IST

ప్రముఖ గాయని లతా మంగేష్కర్ (90)ని అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం ఆసుపత్రిలో జాయిన్ చేసిన సంగతి తెలిసిందే. ఐసీయులో ఉంచి ఆమెకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు కూడా వెల్లడించారు.

అయితే కొన్ని వెబ్ సైట్ల వారు, కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారు లతా మంగేష్కర్ చనిపోయినట్లు వార్తలు ప్రసారం చేశారు. ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీంతో లతా మంగేష్కర్ కుటుంబసభ్యులు స్పందించక తప్పలేదు. 

ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారని.. చనిపోయినట్టుగా జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని అభిమానులని కోరారు. ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. ఈ వార్తలు చూసిన కొందరు సెలబ్రిటీలు సైతం తప్పుడు వార్తలను ప్రచారం చేయొద్దని వేడుకున్నారు.

ఆర్పీజీ ఎంటర్‌ప్రైజెస్ చైర్మన్ హర్ష్ గొయెంకా కూడా లతా మంగేష్కర్ ఆరోగ్యానికి సంబంధించి ఓ ట్వీట్ చేశారు. అమెరికాలోని క్లీవ్‌లాండ్ క్లినిక్‌కు చెందిన వైద్య బృందం లతా మంగేష్కర్‌కు చికిత్సనందిస్తున్నారని.. ఆమె ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతోందని ఆయన ట్వీట్ చేశారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios