'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమాలో ఎన్టీఆర్ పాత్ర పోషించిన నటుడు విజయ్ కుమార్ కి నందమూరి బాలకృష్ణ సహాయం చేశారని నిన్నటి నుండి సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. క్యాన్సర్ బాధ పడుతున్న విజయ్ కుమార్ భార్యకి బాలకృష్ణ తన బసవతారకం హాస్పిటల్ లో ఉచితంగా ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారని వార్తలు రాగానే ఆయన అభిమానులు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేశారు.

ఈ వార్తలపై విజయ్ కుమార్ స్పందించారు. తన భార్యకి రొమ్ము క్యాన్సర్ వచ్చిన మాట నిజమేనని.. ట్రీట్మెంట్ ఎలా చేయించాలనే విషయం తన స్నేహితుల వద్ద ప్రస్తావించగా.. ఏలూరులోని ఆశ్రమ హాస్పిటల్ లో చేర్పించమని చెప్పినట్లు అక్కడ చికిత్స పూర్తయిన తరువాత హైదరాబాద్ కి వచ్చినట్లు చెప్పారు.

స్టార్ హీరోలకు బజ్ ఇస్తున్న ముదురు భామలు!

హైదరాబాద్ లో కీమో థెరపీ చేయించడానికి బసవతారకం హాస్పిటల్ కి తీసుకొచ్చామని చెప్పారు.ఈ విషయం గురించి తన స్నేహితులకు తప్ప మరెవరికీ తెలియదని.. అలాంటిది ఈ వార్తలు ఎలా పుట్టుకొచ్చాయో అర్ధం కావడం లేదని అన్నారు. తను చిన్నప్పటి నుండి ఎన్టీఆర్ కి వీరాభిమాని అని.. అన్నగారి సినిమాలు చూస్తూ పెరిగానని.. రంగస్థలంపై ఆయన వేషాలు వేసి రంగస్థల ఎన్టీఆర్ గా గుర్తింపు తెచ్చుకున్నానని అన్నారు.

ఆయన కొడుకుగా బాలయ్యపై గౌరవం ఉందని.. కానీ ఎప్పుడూ బాలయ్యని కలవలేదని చెప్పారు. బాలయ్య నుండి తనకు ఎలాంటి సహాయం అందలేదని.. బహుశా ఆయనకి తెలిసి ఉంటే సహాయం చేసేవారేమోనని తన అభిప్రాయాన్ని వెల్లడించారు.