Asianet News TeluguAsianet News Telugu

అసభ్యకరమైన ఫొటోలతో నటికి వేధింపులు.. ఏడుస్తూ వీడియో.!

ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూపులో పెట్టడమే కాకుండా.. లోన్‌ తీసుకున్నావంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై లక్ష్మీ ఓ వీడియో ద్వారా తెలియచేసారు.ఈ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు.  

Lakshmi Vasudevan has complained about her morphed image
Author
First Published Sep 27, 2022, 12:35 PM IST


 మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సైబర్‌ నేరాలు పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. మరీ ముఖ్యంగా ఇంటర్‌ నెట్, సెల్ ఫోన్ వినియోగం భారీగా పెరుగుతోన్న భారత్‌లాంటి దేశాల్లో ఈ నేరాల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గడిచిన మూడేళ్లలో భారత్‌లో ఏకంగా 36.29 లక్షల సైబర్‌ సెక్యూరిటీ ఘటనలు నమోదయ్యాంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్దం చేసుకోవచ్చు.  ఈ సైబర్ నేరగాళ్లు విసిరే వలలో చిక్కుకున్న వాళ్లు అంత తర్వగా బయిటపడలేకపోతున్నారు.  రకరకాలుగా టెక్నికల్ నాలెడ్ లేనివారిని తమ వలలో పడేటట్లు చేసుకుంటున్నారు. తర్వాత వేధింపులకు గురిచేస్తున్నారు. ఆర్థికంగా, మానసికంగా,శారీరకంగా ఇబ్బందుల పాలు చేస్తున్నారు.

 తాజాగా, ప్రముఖ సీరియల్‌ నటి లక్ష్మీ వాసుదేవన్‌ సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కారు. వారి వేధింపులకు బలవుతున్నానని ఆమె స్వయంగా తెలియచేసారు. ఆమె ఫొటోలను మార్ఫింగ్‌ చేసి ఫ్యామిలీ వాట్సాప్‌ గ్రూపులో పెట్టడమే కాకుండా.. లోన్‌ తీసుకున్నావంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. ఈ విషయంపై లక్ష్మీ ఓ వీడియో ద్వారా తెలియచేసారు.ఈ వీడియోలో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. తమిళ సీరియల్‌ నటి లక్ష్మీ వాసుదేవన్‌ సైబర్‌ నేరగాళ్ల వలలో చిక్కుకుంది. ఈ విషయాన్ని ఆమె ఓ వీడియో ద్వారా తెలియజేసింది. 

లక్ష్మీ వాసుదేవన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా వాట్సాప్‌లో ఉన్న వారందరికీ.. అలాగే ప్రేక్షకులకు ఈ మెసేజ్‌ చెప్పాలని భావించి ఈ వీడియో చేయడం జరిగింది. నా ఫొటోలను ఎవరో మార్ఫింగ్‌ చేసి,మరీ ముఖ్యంగా అసభ్యకరంగా చేసి నా వాట్సాప్‌లో ఉన్న వారందరికి ఓ కొత్త నెంబర్‌ నుండి పంపుతున్నారు. ఇది ఎందుకు? ఎక్కడ మొదలైందో? ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. నాలా ఎవ్వరూ మోసపోకూడదు అనే ఉద్దేశంతో ఇది చెబుతున్నాను. 

సెప్టెంబర్‌ 11న నాకు ఒక మెసేజ్‌ వచ్చింది. అందులో నాకు రూ.5 లక్షల రూపాయల వరకు లక్కీ డ్రా మనీ వచ్చినట్లు ఉంది. అత్యాశకు పోయి నేను ఆ లింక్‌ను క్లిక్‌ చేశాను. అప్పుడు ఓ యాప్‌ నా మొబైల్ లో ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయింది. ఆ యాప్‌ డౌన్‌లోడ్‌ అయిన కాసేపటికే నా ఫోన్‌ హ్యాక్‌ అయ్యింది. తర్వాత నేను ఆ సంగతి మర్చిపోయాను.కొన్నిరోజుల తర్వాత నాకు కొన్ని మెసేజ్‌లు రావడం స్టార్ట్ అయ్యాయి . మీరు లోన్‌ తీసుకున్నారు.. ఐదు వేల రూపాయల లోన్‌ తీసుకున్నారు.

ఆ లోన్‌ కట్టలేదు అంటూ ఫోన్‌ కాల్స్‌, వాయిస్‌ మెసేజ్‌లు వస్తున్నాయి. అందులో బూతులు తిడుతూ వేధిస్తున్నారు. 5 వేల లోన్‌ కట్టకపోతే మీ మార్ఫింగ్‌ ఫొటోలు అందరికీ పంపుతామని బెదిరిస్తున్నారు. దీంతో నేను హైదరాబాద్‌లోని సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాను.అయితే నా మార్ఫింగ్ ఫోటోలు నా స్నేహితులకు, తల్లిదండ్రులకు, అలా నా ఫ్యామిలీ మెంబెర్స్ అందరికీ వెళ్లాయి. తప్పుడు యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఈరోజు నేను అనుభవిస్తున్నాను. నాలా ఎవ్వరూ అలా మోసపోవద్దని నా మనవి” అంటూ ఏడ్చేసింది ఈ నటి.

 

ఇక దేశంలో పెరిగిపోతున్న సైబర్‌ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం పటిష్ట చర్యలు చేపడుతోందోంది.  సైబర్ భద్రతా వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు, సైబర్ దాడులను నివారించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్తోంది. సైబర్‌ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా యూజర్లకు సలహాలు ఇవ్వడం, సైబర్‌ మోసాలకు సంబంధించి తగిన హెచ్చరికలను ముందుగానే రూపొందించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ఆ శాఖ మంత్రి వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios