హీరోయిన్ లక్ష్మీ రాయ్ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు. హైదరాబాదులో ఓ సినిమా యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేస్తుండగా ఆమె తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స పొంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారు.

హైదరాబాద్: హీరోయిన్ రాయ్ లక్ష్మికి భారీ ముప్పు తప్పింది. రమణ మొగిలి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఓ చిత్రంలో రాయ్ లక్ష్మి ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ఈ సినమా షూటింగ్ ఇటీవల హైదరాబాదులో జరిగింది. ఈ సినిమా కోసం నీటి లోపల యాక్షన్ సీక్వెన్స్ తీస్తుండగా రాయల్ లక్ష్మి గాయపడ్డారు 

ఫైటర్స్ తో ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో రాయ్ లక్ష్మి కాలికి గాయమైందని, వెంటనే ఆస్పత్రికి తీసుకుని వెళ్లామని, చికిత్స తీసుకున్న తర్వాత కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జీ అయ్యారని సినిమా బృందం తెలిపింది. త్వరలోనే సినిమా షూటింగ్ లో రాయ్ లక్ష్మి పాల్గొంటారని కూడా తెలిపింది. 

అది భారీ యాక్షన్ సీక్వెన్స్ అని, పెద్ద ప్రమాదం నుంచి రాయ్ లక్ష్మి తప్పించుకున్నారని కూడా చిత్రబృందం తెలిపింది. ఈ సినమాలో విలన్ గా ప్రదీప్ రావత్ నటిస్తున్నారు ఈ ముఖ్యమైన పాత్రను సీనియర్ నటుడు నరేష్ పోషిస్తున్నారు.