స్టార్ వారసురాలిగా సిల్వర్ స్కీన్ ఎంట్రీ ఇచ్చిన వారసురాలు మంచు లక్ష్మీ ప్రసన్న. విభిన్న పాత్రలతో విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న ఈ భామ తరువాత ఆశించిన స్థాయిలో అవకాశాలు అందుకోలేకపోయింది. అయితే తెర మీద తక్కువగానే కనిపించినా సోషల్ మీడియాలో మాత్రం యమా యాక్టివ్‌ గా ఉంటుంది మంచు లక్ష్మీ తన మీద వచ్చే విమర్శల విషయంలో ఫైర్‌ బ్రాండ్‌లా స్పందించే లక్ష్మీ, సామాజిక అంశాలపై కూడా అంతే అవగాహనతో స్పందిస్తుంది. అదే సమయంలో ఫన్నీ ట్వీట్స్‌తో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తుంటుంది.

ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా తండ్రి  మోహన్‌ బాబు ఇంట్లోనే ఉంటుంది మంచు లక్ష్మీ ఈ నేపథ్యంలో తమతోటలో పూసిన మల్లె పూలు పెట్టుకొని ఆ ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. `అమ్మ  మల్లె పువ్వులు పెట్టింది.. మా తోట పూలు` అంటూ కామెంట్ చేసింది. అయితే మల్లె పువ్వులును ఇంగ్లీషు అక్షరాల్లో మల్లి పువ్వులు అన్నట్టుగా రాసింది మంచు లక్ష్మీ, దీంతో కొంత మంది ఆకతాయిలు ఆమె మీద పంచ్‌లు వేయటం మొదలు పెట్టారు.

ఓ వ్యక్తి మల్లి కాదు అది మల్లె అని కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో చిర్రెత్తుకొచ్చిన మంచు లక్ష్మీ ఆ ట్వీట్‌కు పో బే అంటూ రిప్లై ఇచ్చింది. అయితే ఆ వ్యక్తి కూవా పోవే అంటూ కౌంటర్ ఇచ్చాడు. అయితే వారిద్దరి మధ్య పరిచయం ఉండటం వల్లే ఇలా మాట్లాడుకున్నారా..? లేక నిజంగా ఆకతాయి ట్వీట్‌కు మంచు లక్ష్మీ పోబే అనే సమాధానం ఇచ్చిందా అన్న ఆలోచనలో పడ్డారు నెటిజెన్లు. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో మల్లెపూలు తరుచూ వార్తల్లో నిలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.