తన భర్త ఆత్మహత్యకి తనను బాధ్యురాలిని చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు నటుడు కుశాల్ పంజాబీ భార్య అడ్రే డోలెన్‌. కుశాల్ తో తనకు అభిప్రాయ భేదాలు తలెత్తిన మాట వాస్తవమేనని.. అయితే తన కారణంగా అతడు చనిపోలేదని అన్నారు. ఇటీవల బాలీవుడ్ నటుడు కుశాల్ పంజాబీ బాంద్రాలోని తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించిన సంగతి తెలిసిందే.

తన చావుకి ఎవరూ కారణం కాదని.. తన ఆస్తిని తల్లితండ్రులు, తన కొడుకు కియాన్ కి సమానంగా పంచాలని సూసైడ్ నోట్ కూడా రాశారు. అయితే కుశాల్ తల్లితండ్రులు మాత్రం తమ కుమారుడి మృతికి కారణం కోడలి వేధింపులేనని ఆరోపణలు చేస్తున్నారు. కియాన్ కి కుశాల్ ని దూరం చేసిందని.. డబ్బులు ఇవ్వాలంటూ వేధించిందని అందుకే కుశాల్ సూసైడ్ చేసుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు.

విచారణ జరపకపోతే ఊరుకోం.. జీవితారాజశేఖర్ ఫైర్!

ఈ ఆరోపణలపై స్పందించిన డోలెన్ తన భర్త సూసైడ్ విషయంలో తనను నిందించడం కరెక్ట్ కాదని అన్నారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న మాట వాస్తవమే కానీ.. విడిపోవాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదని చెప్పారు. తన కొడుకు కియాన్ ని తండ్రి నుండి దూరం చేయలేదని అన్నారు. కుశాల్ కి బంధాలపై ఆసక్తి లేదని.. తనను, తన బిడ్డను ఏనాడు లెక్కచేయలేదని అన్నారు.

ప్రస్తుతం తను చైనాలో ఉద్యోగం చేస్తున్నానని.. పలు సార్లు కుశాల్ ని ఇక్కడకి రమ్మని పిలిచానని కానీ ఆయన ఎప్పుడూ రాలేదని చెప్పారు. ఇప్పుడు తనపై నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగరీత్యా చైనాలో ఉండడం కూడా కుశాల్ కి ఇష్టం లేదని.. కానీ తనకు జాబ్ వదులుకోవడం ఇష్టం లేదని చెప్పారు. కొడుకు భవిష్యత్తు గురించి శ్రద్ధ లేని కుశాల్ ని నమ్మాలనుకాలేదని అన్నారు.