Asianet News TeluguAsianet News Telugu

మల్లేశం సినిమాకు కేటీఆర్ శుభవార్త

సినిమాలో `సముద్ర గ‌ర్భంలో దాగిన బ‌డ‌బాగ్నులెన్నో, స‌మాజంలో అజ్ఞాత సూర్య‌లెంద‌రో, గాయ‌ప‌డిన క‌వి గుండెల్లో రాయ‌బ‌డ‌ని క‌విత‌లెన్నో` అనే ఓ క‌విత సినిమాలోని రెండు గంట‌ల ఎమోష‌న్‌ని, ప్ర‌యాస‌ని, కృషి, సామాన్యుడి ప్ర‌తిభా పాట‌వాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలుంటాయో తెలియ‌జేసిందని కేటీఆర్ అన్నారు. 

KTR promotes Mallesham biopic
Author
Hyderabad, First Published Jun 15, 2019, 9:05 PM IST

హైదరాబాద్: పద్మశ్రీ చింతకింది మల్లేశం సినిమా ఆధారంగా నిర్మితమైన మల్లేశం సినిమాకు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ శుభవార్త చెప్పారు. మ‌ల్లేశం సినిమాను పూర్తి చేయ‌డంలో సూర్యుల్లాగా చాలా మంది ప‌నిచేశారని, వారంద‌రికీ అభినంద‌న‌లని కేటీఆర్ మీడియా సమావేశంలో అన్నారు. సినిమా చాలా హృద్యంగా, చాలా మాన‌వీయంగా, స‌హ‌జంగా, అద్భుతంగా మాన‌వ ఉద్వేగాలను చ‌క్క‌గా క్యాప్చ‌ర్ చేశారని అన్నారు. 

సినిమాలో `సముద్ర గ‌ర్భంలో దాగిన బ‌డ‌బాగ్నులెన్నో, స‌మాజంలో అజ్ఞాత సూర్య‌లెంద‌రో, గాయ‌ప‌డిన క‌వి గుండెల్లో రాయ‌బ‌డ‌ని క‌విత‌లెన్నో` అనే ఓ క‌విత సినిమాలోని రెండు గంట‌ల ఎమోష‌న్‌ని, ప్ర‌యాస‌ని, కృషి, సామాన్యుడి ప్ర‌తిభా పాట‌వాన్ని ఆవిష్క‌రించే క్ర‌మంలో ఎన్ని క‌ష్ట‌న‌ష్టాలుంటాయో తెలియ‌జేసిందని కేటీఆర్ అన్నారు. 

సినిమాలో మూడు నాలుగు అంశాలు తన హృద‌యానికి చాలా ద‌గ్గ‌ర‌య్యాయని చెప్పారు. భార‌త‌దేశంలోని అంద‌రూ చేనేత కార్మికులు ప‌డే క‌ష్టం మ‌రుగున ప‌డిపోతున్న క‌ళ‌గా అంత‌రించిపోతున్న త‌రుణంలో వారి నైపుణ్యానికి పెద్ద పీట వేస్తూ వారి క‌ష్ట‌న‌ష్టాల‌ను కూడా ఈ సినిమాలో ప్ర‌స్తావించారని చెప్పారు. చేనేత క‌ళాకారుల ఆత్మ‌హ‌త్య‌ల‌ను, స్థితిగ‌తుల‌ను చూపెడుతూ, ఈ వృత్తిలో రాణించాలంటే ఉండే క‌ష్ట‌న‌ష్టాల‌ను చూపారని, అందులో భాగంగా ఓ రూర‌ల్ ఇన్‌వెంట‌ర్ జీవితాన్ని చూపించారని ఆయన కొనియాడారు. 

ప‌ద్మ‌శ్రీ చింత‌కింది మ‌ల్లేశంకు చేనేత క‌ళాకారుల‌కి, తెలంగాణ ప్ర‌భుత్వం గ‌డిచిన ఐదేళ్లుగా భార‌త‌దేశంలో ఏ ప్ర‌భుత్వం చేయ‌నన్ని అద్భుత‌మైన కార్య‌క్ర‌మాలు చేసిందని, చింతకింది మ‌ల్లేశం మ‌రో యూనిట్‌ను స్టార్ట్ చేయ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం కోటి రూపాయ‌ల ఆర్ధిక సాయాన్ని చేసింద‌ని ఆయన గుర్తు చేశారు. .
 
ప్రియ‌ద‌ర్శి లీడ్ క్యారెక్ట‌ర్‌లో అద్భుతంగా న‌టించారని, ఆయ‌న‌కు అభినంద‌నలని కేటీఆర్ అన్నారు అలాగే రైట‌ర్ అశోక్‌కుమార్‌ తెలంగాణ భాష‌, యాస‌లోని మాధుర్యాన్ని చ‌క్క‌గా ఆవిష్కరించారని చెప్పారు. ఈ సినిమాకు ప్ర‌భుత్వం నుండి స‌హకారం ఎంతో అవ‌స‌రమని, ఆ స‌హ‌కారాన్ని అందించాల‌ని సినిమాటోగ్రాఫ‌ర్ మంత్రితోనూ, గౌర‌వ ముఖ్య‌మంత్రితోనూ చెప్తానని ఆయన అన్నారు. ప‌ది మందికి ఈ సినిమాను చేర్చేలా చేయాల్సిన స‌హ‌కారం అది పన్ను మినహాయింపు అయినా, మ‌రేదైనా తన వంతుగా ఉడ‌తా భ‌క్తిగా చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తాన‌ని ఆయన అన్నారు. 
 
రాజ్‌, వెంక‌ట్ ఈ సినిమాను తనకు చూపించారని నిర్మాత డి. సురేష్ బాబు అన్నారు. ఆయ‌న ప్యాష‌న్ చూసి తాను భ‌య‌ప‌డ్డానట్లు తెలిపారు. అమెరికాలో ఉండే రాజ్ సినిమాల‌పై ప్యాష‌న్‌తో 6వ త‌ర‌గ‌తి ఫెయిలై వ్య‌క్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఓ సినిమా చేశారని చెప్పారు.
 
తాను మ‌ల్లేశం వీడియో చూసి తాను స్ఫూర్తి పొందినట్లు దర్శకుడు చెప్పారు. ఇందులో రూర‌ల్ ఇన్నోవేష‌న్‌, హ్యాండ్ లూమ్స్ స‌మ‌స‌స్య‌లు, హ్యుమ‌న్ మోటివేష‌నల్ స్టోరీ ఉందని. అందుక‌నే ఈ సినిమాను చేశామని అన్నారు. మల్లేశం సినిమా జూన్ 21న విడుద‌ల‌వుతోంది.

Follow Us:
Download App:
  • android
  • ios