ప్రస్తుతం ఎక్కడ చూసినా థమన్ పాటలే వినిపిస్తున్నాయి. "అల'..వైకుంఠపురములో' సినిమా పాటలు విడుదలైన మొదటి రోజు నుంచే సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేశాయి. అత్యధిక లైకులు పొందిన సాంగ్ గా 'సామజవరగమన' గుర్తింపు దక్కించుకుంది. ఆ సాంగ్ కి సెలబ్రెటీలు సైత ఇష్టపడుతున్నారు.  ఇక ఇప్పుడు తెలంగాణ మంత్రి కేటీఆర్ సైతం థమన్ ఇచ్చిన ట్యూన్ కి ఫిదా అవుతున్నారు.

సాంగ్ తన మైండ్ లో నుంచి పోవడం లేదని సోషల్ మీడియా ద్వారా కామెంట్ చేశారు. ప్రస్తుతం స్విజర్ ల్యాండ్ లో ఉన్న కేటీఆర్ అక్కడి వాతవరణంకి సంబందించిన ఫోటోలను షేర్ చేస్తూ.. తెల్లవారు జామున 3.30గంటలు అవుతోందని, ఈ సమయంలో సామజవరగమన పాట తనకు మంచి కంపెనీ ఇస్తుందని అన్నారు. ఇంతమంచి పాటను అందించినందుకు థమన్ ని అభినందించారు.

అందుకు థమన్ కూడా సంతోషపడుతూ రీ ట్విట్ చేశారు. సినిమా పాటను మరీంత సెన్సేషన్ అయ్యేలా చేసినందుకు ప్రత్యేక కృతజ్ఞతలని థమన్ తనదైన శైలిలో వివరణ ఇచ్చారు.  గత కొన్ని నెలలుగా థమన్ గ్యాప్ లేకుండా వర్క్ తో బిజి అవుతున్నాడు. ఓ వైపు స్పెషల్ సాంగ్స్ ని అందిస్తూ మరోవైపు సినిమాలకు సంబందించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై కూడా థమన్ స్పెషల్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు.