అందాల మెరుపుతీగ కృతి సనన్ టాలీవడ్ లో పరాజయాలు ఎదుర్కొన్నప్పటికీ బాలీవుడ్ లో రాణిస్తోంది. మోడల్ గా రాణిస్తున్న కృతి సనన్ సూపర్ స్టార్ మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో హీరోయిన్ గా పరిచయం అయింది. ఆ చిత్రం నిరాశపరచినప్పటికీ కృతి నాజూకు అందాలు ఆకట్టుకున్నాయి. 

ఆ తర్వాత కృతి సనన్ దోచెయ్ చిత్రంలో నటించగా అది కూడా నిరాశపరిచింది. దీనితో కృతి సనన్ బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ప్రస్తుతం కృతి బాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకుపోతోంది. 

బాత్ టబ్ లో బిగ్ బాస్ బ్యూటీ బోల్డ్ ఎక్స్ పోజింగ్.. హాట్ ఫోటోస్

తాజాగా కృతి సనన్ ఇంస్టాగ్రామ్లో ఓ పిక్ పోస్ట్ చేసింది. ఈ పిక్ లో కృతి సనన్ డాషింగ్ లుక్ తో ఆకట్టుకుంటోంది. స్టైలిష్ గా ఉన్న ఈ పిక్ కు కృతి ఓ కొటేషన్ ని కూడా జత చేసింది. మీ జీవితంలో ఆలోచనలకు షరతులు తొలగించండి. మీగురించి ఎవరో చెప్పేలోపు.. హృదయంతో మీరు ఎవరో తెలుసుకోండి.. అని కృతి సనన్ పోస్ట్ పెట్టింది. 

ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ లో మిమి అనే చిత్రంలో నటిస్తోంది. ఇప్పటివరకు గ్లామర్ రోల్స్ చేసిన కృతికి ఇది ప్రయోగాత్మక చిత్రం. ఈ చిత్రంలో కృతి సనన్ సరోగసి ద్వారా తల్లి అయిన మహిళ పాత్రలో నటిస్తోంది.