కరోనా కారణంగా ఎప్పుడూ బిజీగా ఉండే సెలబ్రిటీలు కూడా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో వాళ్లంతా సోషల్ మీడియాలో బిజీగా అయిపోయారు. కొంత మంది తమ డైలీ రొటీన్‌ను అభిమానులతో షేర్ చేసుకుంటుంటే మరికొందరు మాత్రం త్రో బ్యాక్‌ ఫోటోస్ వీడియోస్‌ను షేర్‌  చేస్తూ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్లిపోతున్నారు. టాలీవుడ్‌ బాలీవుడ్‌ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. ఒకరు చేసిన ట్వీట్‌కు మరొకరు రిప్లై ఇవ్వటం ఆ ట్వీట్ వైరల్‌గా మారటం ఇప్పుడు ట్రెండ్ అయ్యింది.

తాజాగా బాలీవుడ్‌ బ్యూటీ కృతి సనన్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో కొన్ని ఫోటోస్‌ను షేర్‌ చేసింది. డిఫరెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఉన్న ఆ ఫోటోలతో పాటు `నేను ఆలోచిస్తాను. కొన్ని సార్లు అతిగా ఆలోచిస్తాను` అంటూ కామెంట్ చేసింది. అయితే ఈ ఫోటోలపై యంగ్ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ ఫన్నీగా స్పందించాడు. నీ డ్రెస్‌కు మంజు భాయ్‌ పెయింట్ వేశాడా అంటూ కామెంట్ చేశాడు కార్తీక్‌. మంజు భాయ్‌ అనేది వెల్‌ కం సినిమాలో అనిల్ కపూర్‌ పోషించిన క్యారెక్టర్‌. ఈ సినిమాలో ఫెయింటింగ్ మీద ఆసక్తి ఉన్న మంజు భాయ్ వింత పెయింటింగ్స్ గీస్తుంటాడు.
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Yup I’m a thinker 💭💭 Sometimes.. An Over-thinker 🤯

A post shared by Kriti (@kritisanon) on Apr 25, 2020 at 9:28am PDT

అయితే కార్తీక్‌ కామెంట్‌ కు కృతి కూడా అదే రేంజ్‌లో రిప్లై ఇచ్చింది. `అవును నీ దుస్తులు ఎవరైతే తయారు చేస్తారో తనే` అంటూ రిప్లై ఇచ్చింది కృతి. సినిమాలు లేకపోయినా ఇలా సోషల్  మీడియా కాన్వర్జేజన్‌తో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తున్నారు స్టార్స్‌. లాక్ డౌన్‌ ప్రకటించిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్‌ అయ్యాడు యంగ్ హీరో కార్తిక్ ఆర్యన్‌. తన వంతుగా ప్రధాని సహాయ నిధికి కోటి రూపాయల విరాళం ప్రకటించిన కార్తిక్‌, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నాడు.

ఇక సినిమాల విషయానికి వస్తే.. కార్తిక్‌ ఆర్యన్‌, కృతి సనన్‌లు లుకా చప్పీ, పతీ పత్నీ ఔర్‌ ఓ సినిమాల్లో కలిసి నటించారు. కృతి సనన్‌ చివరగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన పానిపట్‌ సినిమాలో కనిపించింది. కార్తిక్‌ ఆర్యన్‌ ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లవ్‌ ఆజ్ కల్‌ 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో సారా అలీ ఖాన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది.