నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది కృతి కర్బంద. తెలుగులో కృతి కర్బంద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన తీన్ మార్ చిత్రంలో నటించింది. ఆ చిత్రంతో కృతి కర్బంద హోమ్లీ లుక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి. లంగాఓణిలో కుర్రకారు హృదయాలు దోచుకుంది. 

అలాగే ఒంగోలు గిత్త, బ్రూస్ లీ లాంటి చిత్రాల్లో కూడా కృతి కర్బంద మెరిసింది. ప్రస్తుతం కృతి సౌత్ లో సినిమాలు తగ్గించి.. బాలీవుడ్ లో జోరు పెంచింది. రీసెంట్ గా కృతి హౌస్ ఫుల్ 4, పాగల్ పంతి లాంటి చిత్రాలతో విజయాలు దక్కించుకుంది. ఇక బాలీవుడ్ లో రాణించాలంటే గ్లామర్ షో పెంచాల్సిందే. 

అందాలతో ఆకర్షిస్తూనే ఇతర కళలకు కృతి కర్బంద పదును పెడుతోంది. గతంలో కృతి పోల్ డాన్స్ నేర్చుకుంటున్న వీడియోను తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసింది. గ్లామర్ ఒలకబోస్తూనే హార్ట్ బీట్ అమాంతం పెంచేలా పోల్ డాన్స్ చేసింది. ఈ వీడియో నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటోంది.