హాలీవుడ్ నటి క్రిస్టెన్ స్టివార్డ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. క్రిస్టెన్ తన కెరీర్ లో చాలా మంది నటులతో ప్రేమ వ్యవహారాలు సాగించింది. వారితో డేటింగ్ కూడా చేసింది. ఆమెతో కలసి ఏళ్ల తరబడి డేటింగ్ చేసిన నటులు చాలామందే ఉన్నారు. 

ఇటీవల క్రిస్టెన్ మీడియాతో మాట్లాడుతూ తన మాజీ ప్రియుడిని గుర్తు చేసుకుంది. ట్విలైట్ చిత్రంలో హీరోగా నటించిన హీరో రాబర్ట్ ప్యాటిన్సన్ ని క్రిస్టెన్ గుర్తు చేసుకుంది. అతడితో కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసిన తర్వాత వీరిద్దరూ విడిపోయారు. తాజాగా క్రిస్టెన్ మాట్లాడుతూ.. రాబర్ట్ పై నాకున్న ప్రేమ అబద్దం కాలేదు. 

నిజంగా అతడిని ప్రేమించా. నా బాయ్ ఫ్రెండ్స్ లో అతడే బెస్ట్ అని క్రిస్టెన్ తెలిపింది. భవిష్యత్తులో రాబర్ట్ ని వివాహం చేసుకునే ఆలోచన ఉందా అని ప్రశ్నించగా.. చెప్పలేను అంటూ అనుమానం వ్యక్తం చేసింది. ఇటీవల క్రిస్టెన్ తనని తానూ లెస్బియన్ గా ప్రకటించుకుని సంచలనం సృష్టించింది. ప్రస్తుతం ఈ తార డైలాన్ మేయర్ అనే నటితో సహజీవనం చేస్తోంది. 

వీరిద్దరి ఎఫైర్ కొన్ని రోజులు పాటు హాట్ టాపిక్ గా మారినా ఆ తర్వాత జనాల్లో అంతా మామూలైపోయింది. క్రిస్టెన్ ప్రధాన పాత్రలో నటించిన చార్లెస్ ఏంజిల్స్ చిత్రం నవంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

స్వలింగ సంపర్కురాలిగా వివాదాలు ఎదుర్కొన్నప్పటికీ నటిగా మాత్రం హాలీవుడ్ లో క్రిస్టెన్ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.