మురారి - నిన్నే పెళ్లాడతా - ఖడ్గం వంటి ఎన్నో డిఫరెంట్ ఎమోషనల్ సినిమాలను తెరకెక్కించిన టాలెంటెడ్ డైరెక్టర్ కృష్ణవంశీ గతకొంత కాలంగా వరుస అపజయాలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని ఈ సీనియర్ దర్శకుడు ఒక మరాఠి కథను తెలుగులో రీమేక్ చేస్తున్నాడు. రంగమార్తాండ అనే టైటిల్ ని కూడా ఫిక్స్ చేశారు

ఇకపోతే సినిమాలో క్యాస్టింగ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది. ప్రకాష్ రాజ్ - రమ్యకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జబర్దస్త్ యాంకర్ అనసూయ ఒక స్పెషల్ గెటప్ లో దర్శనమివ్వనుంది. అలాగే బ్రహ్మానందం మునుపెన్నడు లేని విధంగా ఒక ఎమోషనల్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇప్పుడు ఒక స్టార్ హీరో కూతురు కూడా ప్రాధాన పాత్రలో సినిమాలో నటించనున్నట్లు టాక్ వస్తోంది.

ఆమె ఎవరో కాదు. సీనియర్ హీరో రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక.  దొరసాని సినిమాతో ఈ ఏడాది సినీ తెరకు ఎంట్రీ ఇచ్చిన శివాత్మిక ఊహించని విధంగా డిజాస్టర్ ని ఎదుర్కొంది. దేవరకొండ బ్రదర్ ఆనంద్ హీరోగా నటించిన ఆ సినిమా విడుదలైన మొదటి రోజే ప్లాప్ టాక్ ను అందుకుంది. ఆ సినిమా ఫెయిల్ అయినప్పటికీ శివాత్మికకి నటిగా మంచి గుర్తింపు దక్కింది.

మొదటి సినిమా అయినప్పటికీ అనుభవం గల నటిగా శివాత్మిక ఆడియెన్స్ ని ఆకర్షించింది. ఇక ఇప్పుడు కృష్ణవంశీ సినిమాలో అవకాశం దక్కించుకుంది.  ఈ సినిమాలో ముందుగా చాలా మంది యువ హీరోయిన్స్ ని అనుకున్నప్పటికీ దర్శకుడు ఫైనల్ గా శివాత్మికను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే సినిమాకు సంబందించిన షూటింగ్ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని కృష్ణవంశీ ఛాలా కష్టపడుతున్నాడు. మరి సినిమా ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.