డైరక్టర్ క్రిష్  కు ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్ ముందు దాకా మంచి పేరుంది. ఏ ప్రాజెక్టు పట్టుకున్నా పేరు,డబ్బు వస్తాయనే నమ్మకం ఉంది. అయితే నందమూరి తారక రామారావు వంటి గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను తెరకెక్కించటంలో ఫెయిల్ అవ్వటంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ ఆయన్ని దూరం పెట్టినట్లు అయ్యిపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక్క ప్రాజెక్టు కూడా సెట్ కాలేదు. కానీ ఆయన ప్రయత్నాలు మాత్రం మానలేదు. పెద్ద హీరోలనే ఆయన కలుస్తున్నారు, కథలు వినిపిస్తున్నారు. రీసెంట్ గా పవన్ ని కూడా కలిసి ఓ స్టోరీ లైన్ చెప్పారని వార్తలు వచ్చాయి. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది తెలియరాలేదు.

ఇప్పుడు క్రిష్ ...మెగాస్టార్ చిరంజీవి కలిసేందుకు ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అలాగని చిరంజీవితో సినిమా చెయ్యాలని కాదట. పవన్ కళ్యాణ్ రీఎంట్రీకు ఒప్పుకోవటం లేదని, ఆయనకు చెప్పగలిగే ఒకే ఒక వ్యక్తి చిరంజీవి కాబట్టి, ఆయన్ని కలిసి రిక్వెస్ట్ చేస్తారని తెలుస్తోంది.  పవన్ ని ఒప్పించటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని ఉపయోగించనున్నారట క్రిష్.

ఇక తను చెప్పిన సబ్జెక్టు పవన్ పొలిటికల్ కెరీర్ కు సైతం ఉపయోగపడుతుందని, అప్పట్లో ఎన్టీఆర్ సైతం రాజకీయాల్లోకి వచ్చాక కూడా సినిమాలు చేసారని, అవి ఆయనకు బాగా ఉపకరించాయని చెప్పి ఒప్పించాలనే ఆలోచనలో ఉన్నారట. అలాగే పవన్ సిద్దాంతాలను తన సినిమాతో ప్రమోట్ చేసే అవకాసం ఉందని కూడా చిరుకు చెప్పి పవన్ ని ఒప్పించమని కోరనున్నారట. మరి చివరకు ఏమౌతుందో..పవన్ ఏమంటారో , చిరు ఆ భాధ్యత తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది.