ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ‘బీ ది రియల్ మెన్’ అనే  ఛాలెంజ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి ...ఇంట్లో ఆడవాళ్లకు సాయం చేసే వాడే నిజమైన మగాడు అంటూ ‘బి ది రియల్ మేన్’ అనే ఛాలెంజ్ ప్రారంభించాడు. సెలబ్రెటీల ప్రతి ఛాలెంజ్ లతో ఇది దూసుకువెళ్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ నేపథ్యంలో అందరు ఇంట్లో ఉంటున్నారు కాబట్టి.. ఇంట్లో వాళ్లకు ఇంటి పనుల్లో తోచిన సాయం చేయమని చెప్పడమే ఈ చాలెంజ్ ఉద్దేశ్యం. ఇప్పటికే సందీప్ రెడ్డి.. ఈ  ఛాలెంజ్‌కు రాజమౌళిని నామినేట్ చేసాడు. 

జక్కన్న కూడా ఇంట్లో పనులు చేసి ఈ ఛాలెంజ్‌ను ఎన్టీఆర్, రామ్ చరణ్‌‌తో పాటు దర్శకుడు సుకుమార్‌తో పాటు కీరవాణి, బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డను నామినేట్ చేసిన సంగతి తెలిసిందే కదా.   దర్శకుడు రాజమౌళి ‘బి ది రియల్ మెన్’ ఛాలెంజ్ ను స్వీకరించి ఇల్లు ఊడ్వడంతో పాటు ఇంట్లో బాసాన్లు కడిగి తన భార్యకు సహాయం చేసి వీడియో వదిలారు. ఈ నేపధ్యంలో ఆ ఛాలెంజ్ ని సామాన్య జనంలోకి తీసుకు వెళ్లాలనుకున్నాడు క్రిష్.

తనకు సంగీత దర్శకులు కీరవాణి విసిరిన ఛాలెంజ్‌ను పూర్తి చేసి ఆ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసిన క్రిష్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ని టార్గెట్ చేస్తూ ఛాలెంజ్ చేసారు చేశారు. అందరిలా వేరే సెలబ్రిటినీ నామినేట్ చేయకుండా ఏకంగా పవన్ ఫ్యాన్స్ అందరికీ సవాల్ చేశారు.

 ‘‘కీరవాణి ఇచ్చిన సవాల్ పూర్తి చేశాను. ఇప్పుడు ఈ ఛాలెంజ్‌ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్వీకరించాలని కోరతున్నా. ఈ ఛాలెంజ్ ద్వారా ఇంటి పనులు చేసి తమ ఇళ్లలోని ఆడవారికి సాయపడాలని కోరుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు క్రిష్. మరి ఇప్పుడు క్రిష్ చేసిన ఛాలెంజ్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తుందని అందరూ భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ సినిమాలోకి కమ్ బ్యాక్ ఇస్తూ వరుసగా మూడు సినిమాలు ప్రకటించారు. వీటిలో దర్శకుడు వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తుంటున్న వకీల్ సాబ్ మూవీ చిత్రీకరణ చివరిదశకు చేరుకోగా.. దర్శకుడు క్రిష్ తెరకెక్కిస్తున్న మూవీ షూటింగ్ ప్రోగ్రెస్ లో ఉంది. క్రిష్ పీరియాడిక్ మూవీగా తెరకెక్కిస్తుండగా పవన్ బందిపోటుగా కనిపిస్తారట.