బాహుబలి తరువాత దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ఆర్ ఆర్‌ ఆర్‌. మెగా పవర్‌ స్టార్ రామ్ చరణ్‌. యంగ్ టైగర్‌ ఎన్టీఆర్‌ లు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాలను ఇటీవల ప్రారంభించారు. టైటిల్‌ లోగో తో పాటు రామ్ చరణ్‌ క్యారెక్టర్‌ ను పరిచయం చేస్తూ మరో టీజర్‌ ను రిలీజ్ చేశారు. పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తుండగా ఎన్టీఆర్‌ కొమురం భీం పాత్రలో నటిస్తున్నాడు.

ఇప్పటికే మేజర్‌ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, కోలీవుడ్ విలక్షణ నటుడు సముద్రఖనిలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలన్లుగా హాలీవుడ్‌ నటులు కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌ బయటకు వచ్చింది. ఈ సినిమాలో ఓ టాప్ స్టార్ అతిథి పాత్రలో కనిపించనున్నాడట. అది కూడా కోలీవుడ్‌ టాప్ హీరో ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే భారీ తారగణం ఉన్న ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌ కూడా అతిథి పాత్రలో కనిపించనున్నాడట. తమిళ నాట వరుస విజయాలతో దూసుకుపోతున్న విజయ్‌, ఇంత వరకు స్ట్రయిట్ తెలుగు సినిమాలో నటించలేదు. దీంతో ఆర్ ఆర్ ఆర్ విజయ్ నటిస్తున్నాడన్న వార్తలు వినిపిస్తుండటంతో ఫ్యాన్స్‌ పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ వార్తలుపై చిత్రయూనిట్ ఇంత వరకు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయలేదు. దీంతో విజయ్ నిజంగానే ఆర్ ఆర్ ఆర్‌ లో నటిస్తున్నాడా..? లేదా అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి.
Thalapathy Vijay has some advice for his fans | Tamil Movie News ...