నటి త్రిష తనను మోసం చేసిందంటూ ఓ తమిళ నిర్మాత వాపోతున్నాడు. '96' సినిమాతో కోలీవుడ్ లో సక్సెస్ అందుకున్న త్రిష వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆమెకి వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి.

దీంతో ఆమె తమిళనాట బిజీ హీరోయిన్ గా మారింది. ఇదిలా ఉండగా.. త్రిష నటించిన 'ప‌ర‌మ‌ప‌ద‌మ్ విల‌యాట్టు' అనే సినిమా ప్రమోషన్స్ కి వస్తానని డుమ్మా కొట్టడంతో నిర్మాత లబోదిబోమంటున్నాడు. త్రిష మోసం చేసిందంటూ ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు.

సినిమా ప్రమోషన్స్ కి రావాలని త్రిషని ఆహ్వానించినప్పుడు ఆమె తప్పకుండ వస్తానని చెప్పిందట. తీరా ఆ సమయానికి రాలేదని నిర్మాత వాపోయాడు. తన సినిమా ప్రమోషన్ సమయానికే అదే రోజు మరో కొత్త సినిమా ప్రారంభోత్వవం పెట్టుకుందని త్రిషపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

కొత్త సినిమా ఓపెనింగ్ విషయం ముందే చెప్పి ఉంటే.. తామే మరోరోజు ప్రమోషన్ పెట్టుకొని ఉండేవాళ్లమని నిర్మాత చెబుతున్నాడు. ఎన్ని పనులున్నా తప్పకుండా ప్రమోషన్స్ కి వస్తానని మాటిచ్చి.. సమయానికి రాకుండా డుమ్మా కొట్టిందని ఆయన వాపోతున్నాడు.

ఈ సినిమాత్రిష తప్ప మిగిలిన వారంతా కొత్తవారు కాకవడంతో.. ఆమె రావడం ఎంతో ముఖ్యమని చెప్పినా చివరికి త్రిష మోసం చేసిందని.. ఈ విషయం నిర్మాతల మండలి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు.