కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నెక్స్ట్ బిగిల్ సినిమాతో రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు భారీగా నెలకొన్నాయి. మూడవసారి అట్లీ దర్శకత్వంలో విజయ్ నటించడంతో అటు సినీ పరిశ్రమలో కూడా సినిమా బిజినెస్ పై అనేక కథనాలు వెలువడుతున్నాయి. గతంలో వీరి కాంబినేషన్ లో వచ్చిన తేరి - మెర్సల్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ని అందుకున్నాయి.

ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద బిగిల్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందని అంతా భావిస్తున్నారు. గతంలో ఎప్పుడు లేని విధంగా విజయ్ డిఫరెంట్ షేడ్స్ లో కనిపిస్తున్నాడు. ఇక యువ దర్శకుడు అట్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో విజువల్స్ ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇక సినిమా కోసం దాదాపు 180కోట్లవరకు ఖర్చయినట్లు చిత్ర నిర్మాత ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

AGS ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మించిన ఈ సినిమాలో విజయ్ డబుల్ రోల్ లో దర్శనమివ్వనున్నాడు. ట్రైలర్ ఇప్పటికే 20 మిలియన్ల వ్యూవ్స్ నీ దాటేసింది. చూస్తుంటే సినిమా ఓపెనింగ్స్ స్ట్రాంగ్ గా ఉండేలా విజయ్ మంచి బజ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. దీపావళి కానుకగా విడుదల కానున్న బిగిల్ లో యాక్షన్ సీన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాయని టాక్. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో జాకీ ష్రాఫ్ ముఖ్య పాత్రలో నటించారు.