కోలీవుడ్ హీరో కార్తి ఇటీవల ఖైదీ సినిమాతో బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే, మొన్నటివరకు వరుస అపజయాలతో సతమతమైన కార్తీ మొత్తానికి ఖైదీ సినిమాతో సెట్టయ్యాడు. తెలుగులో కూడా సినిమా మన్హసి వసూళ్లను రాబట్టింది. ఇకపోతే నెక్స్ట్ కూడా మంచి సక్సెస్ అందుకోవాలని ప్లాన్ చేసుకుంటున్న కార్తీ ఒక యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కాన్సెప్ట్ తో సిద్దమవుతున్నాడు.

 ఇకపోతే మెగాస్టార్ ఖైదీ టైటిల్ ని వాడుకున్న కార్తీ నెక్స్ట్ కూడా మళ్ళీ మరో మెగా టైటిల్ తో రెడీ అవుతున్నాడు. తమిళ్ లో కార్తీ ప్రస్తుతం తంబీ అనే సినిమా చేస్తున్నాడు.అయితే తెలుగులో  ఆ సినిమాని తమ్ముడుపేరుతో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది. 1999లో పవన్ కళ్యాణ్ నటించిన తమ్ముడు సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

అయితే అదే టైటిల్ ని కార్తీ తన నెక్స్ట్ సినిమాకు సెట్ చేయబోతున్నాడు.  ఖైదీ సినిమా మెగాస్టార్ కెరీర్ లో మరచిపోలేని విజయాన్ని అందించింది. అదే టైటిల్ తో వచ్చిన కార్తీ కూడా మరచిపోలేని బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. ఇప్పటికే సినిమా 100కోట్ల కలెక్షన్స్ ని అందుకుంది. ఇక ఇప్పుడు పవర్ స్టార్ కెరీర్ లో బిగ్ హిట్స్ లో ఒకటైన తమ్ముడు టైటిల్ వాడటం చూస్తుంటే కార్తీ మరో సెంటిమెంట్ హిట్ కొట్టడం కాయమని తెలుస్తోంది.

జీతూ జోసెఫ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కార్తీ వదిన జ్యోతిక కార్తీకి అక్క పాత్రలో కనిపించనుంది. జ్యోతిక నటిస్తోంది అనగానే సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. మరి తెలుగులో ఎంతవరకు సక్సెస్ అందుకుంటారో చూడాలి.