సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య మీరా మిథున్ సంబందించిన న్యూస్ లు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. మోడల్ గా కెరీర్ మొదలుపెట్టిన ఆమె పలు సినిమాల్లో నటించింది. అనంతరం తమిళ్ బిగ్ బాస్ 3 లో మెరిసి అనుకోని కారణాలవల్ల షో నుంచి ఎలిమినేట్ అయ్యింది. ఇక రీసెంట్ గా ఆమె చేసిన ఒక కామెంట్ కోలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ మారింది.

ఆమె నిత్యానందను కలిసేందుకు తెగ ప్రయత్నిస్తున్నారట. అతన్ని కలిసేందుకు ఒక్క అవకాశం ఇవ్వండి అంటూ సోషల్ మీడియా ద్వారా వీడియోలను విడుదల చేస్తోంది. నిత్యానందతో కేవలం ఒక్కసారి మాట్లాడాలన్నది తన కోరిక అంటూ.. నిత్యానంద రాసిన 'లివింగ్‌ ఎన్‌లైట్‌మెంట్‌' అనే పుస్తకంపై ప్రశంసల వర్షం కురిపించింది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

At the end of the day, I'M AT PEACE, because my intentions are good and my heart is pure 💫✨👼

A post shared by Meera Mitun (@meeramitun) on Mar 12, 2020 at 12:49pm PDT

మీరామిథున్‌ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. ప్రస్తుతం నిత్యా నందను అరెస్ట్ చేసేందుకు పొలిసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అతనిపై అనేక రకాల కేసులు నమోదైన విషయం తెలిసిందే. మహిళలను లైంగికంగా వేధించాడని ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక మీరా మిథున్ మాత్రం అతన్ని కలుసుకోవాలని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ గా హాట్ టాపిక్ గా మారింది.