జబర్దస్త్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వాళ్ళు కూడా షోపై నెగిటివ్ కామెంట్స్ చేయడం హాట్  టాపిక్ గా మారింది. గతంలో చాలా మంది సీనియర్ కామెడియన్స్ జబర్దస్త్ నుంచి బయటకు వచ్చినప్పటికీ వేరే కారణాలు చెప్పారు, కానీ జబర్దస్త్ పై ఎప్పుడు కూడా బిన్నంగా స్పందించలేదు. అయితే అందులో కొన్నేళ్లుగా కొనసాగిన కిర్రాక్ ఆర్పీ మాత్రం జబర్దస్త్ వల్ల తాము పాపులర్ కాలేదన్నట్లు మాట్లాడటం అందరిని షాక్ కి గురి చేసింది.

రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కిర్రాక్ ఆర్పీ జబర్దస్త్ ఎవరు ఉహించని విధంగా కామెంట్స్ చేశారు.  జబర్దస్త్ లో నటిస్తూ వచ్చిన ఆదాయంతో ప్లాట్స్, కార్లను కొనుగోలు చేసి ఇప్పుడు బయటకు వెళ్ళిపోగానే ఇలా మాట్లాడటం సరికాదని చాలా మంది కామెంట్ చేస్తున్నారు.

'ఒక యాక్టర్ కి లైఫ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద మాట. అది అన్ని విషయాల్లో ఎక్కడపడితే అక్కడ వాడకూదు. నిజానికి ‘జబర్దస్త్’ అనేది కేవలం ఒక అవసరం మాత్రమే. అవకాశాల మధ్య ఒప్పందమే. నేను రోడ్డు మీద వెళుతుంటే ఎవరు అవకాశాలు ఇవ్వలేదు' అంటూ కిర్రాక్ ఆర్పీ చేసిన కామెంట్స్ కి కౌంటర్లు గట్టిగానే పడుతున్నాయి.

పైగా జబర్దస్త్ లోనే కాకుండా ఈ టీవికి సంబందించిన కార్యక్రమాల్లో కూడా ఎన్నటికీ నటించనని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం వేర్ ప్రోగ్రామ్స్ లో అవకాశాలు వచ్చినప్పటికీ మొదట లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ పై ఈ విధంగా మాట్లాడటం సరికాదని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.