హాలీవుడ్ లెజెండ్ కిర్క్ డగ్లస్(103) కన్నుమూశారు. కిర్క్ గురించి తెలియని సినీ ప్రేమికులుండరంటే అతిశయోక్తి కాదు. తన ప్రతిభతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1916లో అమ్‌స్టర్‌డామ్‌లోని డానిలోవిచ్‌లో నిరుపేద కుటుంబంలో జన్మించారు కిర్క్‌ డగ్లస్‌.

ఎన్నో ఒడిదుడకులను ఎదుర్కొన్న ఆయన డైనా డిల్ ని పెళ్లి చేసుకున్న తరువాత థియేటర్ ఆర్టిస్ట్ గా మారి అంచలంచెలుగా ఎదిగారు. కిర్క్ డగ్లస్ తన కెరీర్ లో 90కి పైగా చిత్రాల్లో నటించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రచయితగా తన సత్తా చాటి ఎందరో అభిమానులను సంపాదించుకున్నాడు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మల్టీస్టారర్ సినిమాలు

'స్పార్టకస్', 'ది వైకింగ్స్' వంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కిర్క్ కు పేరు తెచ్చి పెట్టాయి. వీటితో పాటు 'యాస్‌ ఇన్‌ ద హోల్‌', 'డిటెక్టివ్‌ స్టోరీ', 'లోన్లీ ఆర్‌ ద బ్రేవ్‌', 'సెవెన్‌ డేస్‌ ఇన్‌ మే', 'స్నో రివర్‌', 'ద ఫ్యూరీ', 'గ్రీడీ', 'ఏ సెంచరీ ఆఫ్‌ సినిమా', 'డైమండ్స్‌' వంటి చిత్రాల్లో నటించారు.

కిర్క్ డగ్లస్ మరణ వార్తను ఆయన కుమారుడు మైఖేల్ డగ్లస్ మీడియాకు వెల్లడించాడు. మి'మ్మల్ని చాలా ప్రేమిస్తున్నాను, మీ కొడుకుగా చాలా గర్వపడుతున్నా' అంటూ తన తండ్రికి మైఖేల్‌ డగ్లస్ నివాళులు అర్పించారు.