కరోనా నేపధ్యం లో అన్ని రంగాలు కుదేలవుతున్నాయి. ఇప్పటికే లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి అల్లాడుతున్నారు. ముఖ్యంగా వినోద రంగం మీద కూడా దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంది. సినిమా సెట్ లో పని చేసే రోజువారీ కూలీలు పనులు లేక ఆకలితో అల్లాడుతున్నారు. దీంతో వారి ఆదుకునేందుకు సినీ తారలు ముందుకు వస్తున్నారు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి తన వంతుగా కోటి రూపాయల సాయం ప్రకటించాడు. ఎన్ టీ ఆర్, మహేష్ బాబు లాంటి తారలు కూడా తమ వంతుగా సాయం అందించారు. తాజాగా కింగ్ నాగార్జున కూడా సినీ కార్మికులు సంక్షేమం కోసం భారీ విరాళాన్ని ప్రకటించాడు. పూట గడవక అల్లాడుతున్న కార్మికులు కోసం కోటి రూపాయలు ఇవ్వనున్నటుగా ప్రకటించాడు.

ఈ సందర్భంగా 'లాక్ డౌన్ అన్నది ఓ భయంకర నిజం. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది తప్పని పరిస్థితి. ఇప్పటికే విరాళాలు ప్రకటించిన న తోటి నటి నటులకు నా అభినందనలు. నా వంతుగా నేను కూడా కోటి రూపాయలను రోజు వారీ కూలీ లుగా పని చేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం అందిస్తున్నా. అందరికీ దేవుడి ఆశీస్సులు ఉండాలని ప్రార్థిస్తున్నా ' అంటూ కామెంట్ చేశాడు నాగ్.