సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ కియారా అద్వానీ. తొలి సినిమానే సూపర్‌ స్టార్ సరసన జోడి కట్టడంతో కియారాకు టాలీవుడ్‌ లో కూడా సూపర్‌ క్రేజ్‌ ఏర్పడింది. అంతేకాదు తొలి సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కావటంలో లక్కీ బ్యూటీ అన్న ఇమేజ్‌ కూడా దక్కింది. దీంతో వరుస అవకాశాలు క్యూ కట్టాయి.

అయితే వెంటనే రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన వినయ విధేయ రామ  సినిమాతో డిజాస్టర్ కావటంతో కియారాకు టాలీవుడ్‌లో అవకావాలు తగ్గాయి. అదే సమయంలో బాలీవుడ్‌ లో బిజీ కావటంతో టాలీవుడ్‌ కు పూర్తిగా దూరమైంది ఈ బ్యూటీ. బాలీవుడ్‌లో కబీర్‌ సింగ్‌, అంగ్రేజీ మీడియం లాంటి సూపర్‌ హిట్ సినిమాల్లో నటించటంతో అక్కడ ఫుల్‌ బిజీ అయ్యింది కియారా.

అయితే తాజాగా మరోసారి మహేష్‌కు జోడిగా నటించేందుకు కియారాను సంప్రదించారు. కానీ కియారా మాత్రం తాను బాలీవుడ్‌లో బిజీగా ఉన్నానని మహేష్ సినిమాలో నటించలేనని చెప్పేసిందట. సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్‌ హిట్ అందుకున్న మహేష్ బాబు ఇంక తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ను అధికారికంగా కన్‌ఫార్మ్ చేయలేదు. అయితే పరశురామ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఆ సినిమా కోసం కియారాను సంప్రదించటంతో నో చెప్పేసిందట.