కియారా అద్వానీ తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది. సూపర్ స్టార్ మహేష్ సరసన భరత్ అనే నేను చిత్రంలో, మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన వినయవిధేయ రామ చిత్రంలో రొమాన్స్ పండించింది. భరత్ అనే నేను మంచి విజయం సాధించగా, వినయ విధేయ రామ నిరాశపరిచింది. 

కియారా గ్లామర్, నటన తెలుగు ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. ప్రస్తుతం కియారకు సౌత్ లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. ఈ యంగ్ బ్యూటీ బాలీవుడ్ లో బోల్డ్ రోల్స్ లో నటించడానికి కూడా వెనుకాడడం లేదు. ఆమె నటించిన లస్ట్ స్టోరీస్ వెబ్ సిరీస్ సంచలనం సృష్టించింది. 

రీసెంట్ గా అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ లో నటించింది. ప్రస్తుతం కియారా అద్వానీ వరుసగా బోల్డ్ రోల్స్ ఎంచుకుంటోంది. తాజాగా కియారా గర్భవతిగా అవతారం ఎత్తింది. ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. 

బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ జోరు అందుకోవడం ఇతర హీరోలకు సాధ్యం కావడం లేదు. ఇటీవల హౌస్ ఫుల్ 4 తో సందడి చేసిన అక్షయ్ డిసెంబర్ లో మరో కామెడిజోనర్ మూవీతో రెడీ అయిపోతున్నాడు. కరీనా కపూర్, కియారా అద్వానీ హీరోయిన్లుగా నటిస్తున్న గుడ్ న్యూస్ అనే చిత్రంన్లో అక్షయ్ హీరో. ఈ మూవీలో డిల్జిత్ డోసంజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. 

ఈ చిత్రంలో కియారా అద్వానీ, కరీనా కపూర్ గర్భవతులుగా నటిస్తుండడం విశేషం. తాజాగా విడుదలైన ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్  సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారాయి. కరీనా, కియారా గర్భవతులుగా ఉండగా.. అక్షయ్ కుమార్ వారి మధ్యలో కనిపిస్తున్నాడు. 

కృతిమ పద్దతులతో ఇద్దరు మహిళలు గర్భం దాల్చగా ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు జరిగాయి అనే అంశాల్ని దర్శకుడు రాజ్ మెహతా ఫన్నీగా చూపించబోతున్నాడు. డిసెంబర్ 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.