మాస్ మహారాజ్ నటించిన ‘ఖిలాడీ’మూవీ నుంచి తాజాగా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. మాస్ డైలాగ్స్.. రోమాంటిక్ సీన్స్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రవితేజ తన ఎనర్జీని డబుల్ చేసి విశ్వరూపం చూపించాడు.
మాస్ మహరాజ్ రవితేజ క్రాక్ (Krack)మూవీతో సాలిడ్ కమ్ బ్యాక్ అయ్యాడు. 2021 సంక్రాంతి కానుకగా విడుదలైన క్రాక్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. దర్శకుడు గోపిచంద్ మలినేని అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు. క్రాక్ మూవీ ఇచ్చిన ఊపులో రవితేజ రమేశ్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి మూవీ స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. నెలల వ్యవధిలో చకచకా పూర్తి చేశారు. అన్నీ కుదిరితే గత ఏడాది సమ్మర్ కే ఖిలాడి విడుదల కావాల్సింది. కానీ ఎట్టకేళలకు ఈ నెల 11న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.
ఇప్పటీకే ఈ మూవీ నుంచి టీజర్, రెండు, మూడు సాంగ్స్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా ట్రైలర్ ను విడుదల చేసింది. హైవోల్టేజ్ ముట్టుకుంటే షాక్ కొట్టినట్టు రవితేజ తన మాస్ డైలాగ్స్ తో గూస్ బంబ్స్ తెప్పించారు. మాస్ కు మాస్ తోడైతే ఊర మాస్ అనే రేంజ్ లో ట్రైలర్ సాగిన విధానం ఉంది. ‘ఎప్పుడూ ఒకే టీంకు ఆడటానికి నేషనల్ ప్లేయర్ ను కాదు.. ఐపీఎల్ ప్లేయర్ ను.. ఎవడెక్కువ వాడుకుంటే వాడికే ఆడతాను.. పేకాట లో నలుగురు కింగ్స్ ఉంటారు,ఈ ఆట లో ఒక్కడే కింగ్’వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. కొన్ని మాస్ ఎలిమెంట్స్ కూడా తోడవడంతో ట్రైలర్ ఆసక్తిగా ఉంది.
మరోవైపు రోమాన్స్ లోనూ ఈసినిమా తగ్గలేదు. రవితేజ ఏకంగా లిప్ లాక్ చేస్తూ రెచ్చిపోయాడు. హీరోయిన్ మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి రవితేజ సరసన చక్కగా సరిపోయారు. దీనికి తోడు బుల్లితెర బ్యూటీ ‘అనసూయ’ కూడా కూడా కనిపించడంతో ట్రైలర్ అటు మాస్.. ఇటు గ్లామర్ ను సొంతం చేసుకుంది. అనుదీప్, అర్జున్ కీలకపాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ కూడా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయేలా వాయించాడు.
