టాలీవుడ్ బిగ్ బడ్జెట్ మూవీ RRR రిలీజ్ కోసం మరో ఏడాది వెయిట్ చేయక తప్పదు. మొన్నటి వరకు సినిమా సమ్మర్ లో వస్తుందని అంతా భావించారు. కానీ ఎవరు ఊహించని  విధంగా చిత్ర యూనిట్ మరో ఆరు నెలల సమయం తీసుకొని 2021కి సినిమాని షిఫ్ట్ చేయడం అందరిని షాక్ కి గురి చేసింది. అయితే రిలీజ్ డేట్ పై చాలా వరకు మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

తమ హీరోను మరింత దూరం చేస్తున్నాడు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఎవరికీ ఎంత కోపం వచ్చినా సినిమా రరిలీజ్ వాయిదా పడటం ఒక సినిమా యూనిట్ చాలా ఆనందానికి గురి చేసింది. KGF 2 యూనిట్ మొత్తానికి ఉపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటె ఈ బిగ్ సీక్వెల్ మే2 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు. కనై RRR డేట్ ఎనౌన్స్ చేసిన తరువాత అందరికి ఆ విషయం ఆందోళన కలిగించింది. కానీ ఇటీవల రాజమౌళి మరీంత సమయం కావాలని సినిమా రిలీజ్ తేదీని మార్చడంతో KGF యూనిట్ ఎగిరిగంతేసింది.

ఎందుకంటె ఈ సినిమా కూడా దేశమంతా తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. RRR కూడా అన్ని భాషల్లో పోటీని ఇవ్వడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని.  చిన్న సినిమాకు కూడా పోటీ ఉండకూడదని KGF యాష్ ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక RRR  లాంటి సినిమాతో పోటీ అంటే వెనుకడుగు వేయక తప్పదని అనుకున్నారు. కానీ రాజమౌళే ఆ బిగ్ మూవీ రిలీజ్ డేట్ మార్చడంతో యష్ టీమ్ హ్యాపీగా ఫీల్ అవుతోంది. అనుకున్నట్లుగానే ఇదే ఏడాది సమ్మర్ ఎండ్ లో కూల్ గా సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు.