కెజిఎఫ్ చిత్రంతో యష్ క్రేజ్ దేశవ్యాప్తంగా అమాంతం పెరిగింది. కెజిఎఫ్ కంటే ముందుగానే యష్ కన్నడలో పాపులర్ అయ్యాడు. ఇదిలా ఉండగా యష్ అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ ప్రస్తుతం ఉన్నారు. హీరో యష్ అభిమానులు తనని బెదిరిస్తున్నారు అంటూ ఓ యంగ్ కమెడియన్ పోలీసులకు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 

రంగప్రసాద్ అనే యంగ్ కమెడియన్ యష్ అభిమానుల నుంచి బెదిరింపులు ఎదుర్కొంటున్నాడు. రెండేళ్ల క్రితం రంగప్రసాద్ యష్ నటించిన ఓ చిత్రంలోని డైలాగ్ ని ఫన్నీగా చెప్పాడట. దీనిని యష్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ హీరోని అవమానించే విధంగా డైలాగ్ చెప్పడంతో అతడిపై విరుచుకుపడుతున్నారు. 

రంగప్రసాద్ బెంగుళూరులో ఓ పోలీస్ స్టేషన్ లో యష్ అభిమానులపై కేసు నమోదు చేసిన అనంతరం మాట్లాడుతూ.. యష్ అభిమానులు నన్ను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపించాడు. కామెడీని కామెడీ లాగే చూడాలి. నేను యష్ తో కలసి నటించాడు. అతడంటే నాకు కూడా అభిమానం ఉంది. 

యష్ అభిమానులుగా ఉండి ఇలాంటి బెదిరింపులకు దిగడం సరైనది కాదు. ఇలాంటి చర్యలని యష్ కూడా అంగీకరించడు అని రంగప్రసాద్ పేర్కొన్నాడు. ఎవరిని కించపరిచే ఉద్దేశం తనకి లేదని రంగప్రసాద్ తెలిపాడు. కొందరు నన్ను చంపేస్తాం అంటూ వీడియోలు పంపిస్తున్నట్లు పేర్కొన్నాడు.