గత ఏడాది ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన KGF ఛాప్టర్ 1  ఏ స్థాయిలో విజయాన్ని అందుకుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. పాన్ ఇండియన్ సినిమాగా వరల్డ్ వైడ్ గా రిలీజైన ఈ కన్నడ సినిమా విడుదలైన అన్ని భాషల్లో పాజిటివ్ టాక్ ను అందుకుంది. అలాగే సాలిడ్ కలెక్షన్స్ ని కకూడా అందుకుంది. అయితే ఈ సినిమాలో నటించిన వారికి కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

సినిమాలో కథానాయికగా నటించిన శ్రీనిధి శెట్టి కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. 2016లో మిస్ సుప్రా నేషనల్ కిరీటాన్ని ఈ బ్యూటీ దక్కించుకుంది. ఇక కోలీవుడ్ లో ఇప్పుడు మరో బంపర్ అఫర్ కొట్టేసింది. చియాన్ విక్రమ్ బిగ్ బడ్జెట్ సినిమాలో శ్రీనిధి కథానాయికగా కనిపించబోతోంది. యువ దర్శకుడు అజయ్ జ్ఞాన్ ముత్తు  తెరకెక్కిస్తున్న ఆ సినిమా త్వరలో సెట్స్ పైకి రానుంది.

విక్రమ్ డిఫరెంట్ గెటప్స్ తో కనిపించిననున్నట్లు తెలుస్తోంది.  శ్రీనిధి శెట్టికి ఇది తొలి కోలీవుడ్ సినిమా. విక్రమ్ సినిమాలో అవకాశం దక్కించుకోవడంతో బేబీ నేమ్ తమిళ చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే KGF 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ రెండవ పార్ట్ కోసం దాదాపు 150కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టయ్యింది అంటే శ్రీనిధి కెరీర్ మరింత ఉపందుకుంటుందని చెప్పవచ్చు.